twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి క్షణంలో ప్రభావితం చేసేందుకు శ్రీముఖి ఫ్యాన్స్ ప్రయత్నం.. వైరలవుతోన్న ట్వీట్స్

    |

    బిగ్‌బాస్ షో ముగిసేందుకు వచ్చింది. ఫినాలె ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీముఖి ఫ్యాన్స్ పనిగట్టుకుని ట్వీట్లు చేస్తూ ట్రెండ్ అయ్యేట్లు చేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే వారి ట్వీట్లు మాత్రం ఇంకా ఆగడం లేదు. శ్రీముఖే టైటిల్ గెలవడానికి అర్హురాలంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ విషయాన్ని స్టార్ మా బ‌ృందానికి, ఓటింగ్‌ లెక్కలను చూసే కంపెనీకి ట్యాగ్ చేస్తూ ప్రభావితం చేస్తున్నారు.

    ఓటింగ్‌లో దూసుకుపోయిన రాహుల్..

    ఓటింగ్‌లో దూసుకుపోయిన రాహుల్..

    ఇప్పటి వరకు వినిపిస్తున్నటాక్ ప్రకారం రాహుల్ టైటిల్‌ను గెలిచేశాడు. ఓటింగ్‌లో రాహుల్ ముందంజలో ఉన్న సంగతి తెలిశాకే.. శ్రీముఖి ఫ్యాన్స్ ఇలా కావాలనే ఫలితాన్ని ప్రభావితం చేయాలని అలా ట్రెండ్ చేస్తున్నారని అతని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. వీరిద్దరి ఓటింగ్ శాతంలో అంత పెద్ద తేడా లేకపోయినా.. తక్కువ ఓట్లతోనే రాహుల్ గెలవబోతోన్నట్లు టాక్ వినిపిస్తోంది.

    ప్రభావితం చేసేందుకు ప్లాన్..

    ఫినాలేకు సంబంధించిన షూటింగ్ స్టార్ అయిందని తెలుసుకున్న శ్రీముఖి ఫాలోవర్స్ #SreeMukhiDeservesTheTitle
    అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీటిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిజంగా ఆమెకే ఎక్కువ ఓట్లు వస్తే.. ఆమె టైటిల్ గెలుస్తుందని.. ఇప్పుడు ఇదంతా ఎందుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ట్రెండ్ చేస్తూ మా బృందాన్ని, బిగ్ ‌బాస్ నిర్వాహకులను బెదిరిస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు.

    శ్రీముఖి మూడో స్థానంలో..

    అయితే మరో వైపు ఇంకో ప్రచారం జరుగుతోంది. రాహుల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. వరుణ్ రన్నర్ కానున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో శ్రీ ముఖి మూడో స్థానంలోనే శ్రీముఖి ఆగిపోయిందని తెలుస్తోంది. ఏది ఏమైనా టైటిల్ గెలిచేది ఎవరనే నరాలు తెగే ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్నారు.

    English summary
    Bigg Boss 3 Telugu Updates. Sreemukhi Fans Try To Influence Result In Last Minute. They Are try To Trend #SreeMukhiDeservesTheTitle Hastag. It Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X