సారీ చెప్పిన బాబా భాస్కర్ .. రెచ్చిపోయిన శ్రీముఖి.. అతితో పరమ చిరాకు!
తెలుగు నాట సంచలనంగా మారిన బిగ్ బాస్ రియాల్టీ షో.. ఇంటిల్లి పాదిని అలరిస్తోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అలకలు, అరుపులు, వ్యూహాలు, బుజ్జగింపులు, ప్రేమలు, అప్పుడప్పుడు కొన్ని తిట్లు, కాస్త రొమాన్స్ ఇలా షడ్రుచుల భోజనంలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించడంతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ బిగ్ బాస్ వస్తోందంటే టీవీకి అతుక్కుపోతున్నారు.

సేవ్ చేయలేదని అలిగిన శ్రీముఖి
పదో వారానికిగానూ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ.. శివజ్యోతి, శ్రీముఖిల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. ఎక్కడి విషయాలో మళ్లీ ప్రస్థావనకు తెచ్చేలా చేశాయి. శివజ్యోతికి ఏడుస్తుందంటూ.. ఆమె ఎమోషన్ ను కారణంగా చూపించి నామినేట్ చేసే ప్రయత్నం శ్రీముఖి చేసింది. అయితే ఆ డిబేట్లో శివజ్యోతి మాత్రం మంచి పాయింట్లను లేవనెత్తింది. చివరకు ఇంటి సభ్యులందరి ఓట్లతో శివజ్యోతి సేవ్ కాగా.. శ్రీముఖి నామినేట్ అయింది. అయితే ఇక్కడ బాబా భాస్కర్ ఓటు డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వడమే శ్రీముఖికి మింగుడుపడలేదు.

సారీ చెప్పిన బాబా..
శివజ్యోతి, శ్రీముఖిలకు సరి సమానంగా ఓట్లు రావడంతో.. బాబా ఓటుతో ఫలితం తేలనుంది. అయితే అందరూ శ్రీముఖికే ఓటు వేస్తారు అని అనుకోగా.. గట్టి షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా శివజ్యోతికి ఓటు వేయడంతో శ్రీముఖి మొహం మాడిపోయింది. ఇదే విషయమై.. శ్రీముఖి తెగ బాధపడిపోయింది. ఈ క్షణం తాను ఒంటరయ్యాననే ఫీలింగ్ కలుగుతోందని బాబాతో చెప్పుకొచ్చింది. అయినా ఒంటరిగానే పోరాడేంత ధైర్యం తనకుందని చెప్పుకొచ్చింది.

ఇక నో రిలేషన్
ఇక ఈ ఇంట్లో ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోనని, మీరు కూడా దూరంగా ఉండండని బాబాతో విన్నవించుకుంది. తన కారణంగానే ఫీల్ అవుతోందని భావించిన బాబా.. శ్రీముఖిని క్షమించమని కోరాడు. తాను ఎలాగైనా సేవ్ అవుతుందన్న నమ్మకం, శివజ్యోతి పదే పదే ఏడుస్తుందంటే.. అదే ఎమోషన్ చుట్టూ డిస్కషన్ పెట్టావని అందుకే తనను సేవ్ చేశానని చెప్పుకొచ్చాడు.

టాస్క్‌లో రెచ్చిపోయిన శ్రీముఖి
అత్తను మెప్పించడానికి శ్రీముఖి చేసిన పనులు.. జనాలకు చిర్రెత్తించాయి. టాస్క్లో భాగంగా అయినా.. వరుణ్ కూడా ఇదే మాట అన్నాడు. ఏంటి అంతా ఈ పెద్ద కోడలే హడావిడి చేస్తోంది. మాకు ఇక్కడ అధికారం లేదా? అన్నట్లు సెటైరికల్ అన్నాడు. జనాలకు అదే ఫీలింగ్ కలిగిందని వారికి తెలీదు కదా. నిజంగా నిన్నటి టాస్క్‌లో శ్రీముఖి చేసిన అతి భరించలేనిదిగా అనిపించింది. అత్త అయిన శివజ్యోతి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం.. ఊరికే కాళ్ల మీద పడటం, లేని ప్రేమ చూపించడం లాంటివి ప్రేక్షకులకు విసుగెత్తేలా చేశాయి.


Click it and Unblock the Notifications











