For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్మీకి థ్యాంక్స్.. టైటిల్ గెలిస్తే చేసేదేమీ ఉండదు.. రాహుల్‌పై శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసింది. మొదటి నుంచి అందరూ ఊహించిన శ్రీముఖి విన్నర్‌ కాలేకపోవడం.. ఎటువంటి అంచనాలు లేనటువంటి రాహుల్ టైటిల్ గెలవడం ఆసక్తికరంగా మారింది. శ్రీముఖి తన చేతులారా చేసుకున్న కర్మ వల్లే రాహుల్ విజేతగా నిలిచాడు. పదే పదే టార్గెట్ చేయడం, ప్రతీ చిన్న విషయానికి రాహుల్‌ను వేలెత్తిచూపడం వంటి వాటితో శ్రీముఖి గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో రాహుల్ క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చివరకు బిగ్‌బాస్ టైటిల్‌ను రాహుల్ ఎగరేసుకుపోయాడు. తాను టైటిల్ గెలవకపోవడంపై మొదటిసారిగా శ్రీముఖి స్పందించింది.

లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి..

లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి..

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక.. నేరుగా మాల్దీవులకు చెక్కేసింది శ్రీముఖి. అక్కడే గత వారం రోజులుగా ఎంజాయ్ చేస్తోన్న ఈమె.. శనివారం లైవ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక విషయాలను వెల్లడించింది. ఫ్యాన్స్ అడిగిన కుషల ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చింది. కాంట్రవర్సీ లేవనెత్తే ప్రశ్నలకు కూడా ఎంతో కూల్‌గా సమాధానమిచ్చింది.

టైటిల్ గెలవలేకపోవడంపై కామెంట్స్..

టైటిల్ గెలవలేకపోవడంపై కామెంట్స్..

టైటిల్ గెలిచేశాక చేసేది ఏమి ఉండదు.. ఒకవేళ గెలవకపోతే.. చేయడానికి ఇంకా ఏదో మిగిలి ఉందని.. మనం ఇంకా పూర్తిగా విజయం సాధించలేదని.. విశ్రాంతి తీసుకోకుండా ముందుకు సాగుతాము. అదే ఒకవేళ గెలిస్తే అక్కడితోనే ఆగిపోతాము. ఫైనల్ పాయింట్‌కు రీచ్ కాకపోతే.. ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం ఉంటుంది..సక్సెస్ అనేది అంత తొందరగా వస్తే కిక్ ఉండదు.

రాహుల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాహుల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాహుల్ ఒకప్పుడు నా ఫ్రెండ్.. ఇప్పుడూ నా ఫ్రెండ్.. హౌస్‌లో పరిస్థితుల వల్ల అలా మా మధ్య గొడవలు వచ్చాయి.. అయినా మేము స్నేహితులమే..బయటకు వచ్చాక నేను వాటినే గుర్తుపెట్టుకోవాలను కోవడం లేదు.. పైనల్‌గా మేమంతా కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేశామా లేదా అన్నదే ముఖ్యం.

రష్మీ, ముక్కు అవినాష్‌లకు థ్యాంక్స్

రష్మీ, ముక్కు అవినాష్‌లకు థ్యాంక్స్

తనకు ఎంతగానో సపోర్ట్ చేసిన ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్స్, నా ఫ్యామిలీ కాకుండా బయటి నుంచి చాలా మంది మద్దతు తెలిపారు. ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్ ఇలా ప్రతీ ఒక్కరూ.. నేను వ్యక్తిగతంగా తెలిసిన ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్స్

 ట్యాటూను చూపిస్తూ..

ట్యాటూను చూపిస్తూ..

తన చేతిపై పొడిపించుకున్న ట్యాటూ నకిలీదనని అందరూ అనుకుంటున్నారు.. అందుకే చూపించమని అడుగుతున్నారు.. అలాగే చూపిస్తాను.. మా తమ్ముడిని దానిపై రుద్దమంటాను.. మీకు ఇంకా క్లారిటీ వస్తుందని తెలిపింది. శ్రీముఖి చేతిపై ఉన్న పచ్చబొట్టును శుశ్రుత్ రుద్దుతుండగా లైవ్‌లో చూపించి అందరి అనుమానాలను పటాపంచలు చేసింది.

English summary
Sreemukhi Came Into Live On Instagram. She Revealed Interesting Facts. She Tells About Her New Shows. Her Opinion On Rahul, Baba Bhaskar, Varun Sandesh, Ali Reza Etc. Sreemukhi Thanked Rashmi, Jhansi, Patas Artist Who Ever Supported Her.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more