బ్రేకప్ అయింది.. చచ్చిపోదామనుకున్నా అంటూ శ్రీముఖి షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటరయ్యాక వారి లైఫ్‌లో జరిగిన ప్రతీ సన్నివేశాలు, ముఖ్యమైన ఘట్టాలను ఎప్పుడో ఒకప్పుడు చెప్పిస్తాడు. టాస్క్‌లు ఇచ్చి మరి తమ లైఫ్‌లో జరిగిన సంఘటనల గురించి చెప్పమంటాడు బిగ్‌బాస్. ఇదే విధంగా ఇంతవరకు ఓపెన్ కాని శ్రీముఖి చేత కూడా బిగ్‌బాస్ తన వ్యక్తిగత విషయాలను చెప్పించాడు.
తాను ఇక్కడి వచ్చింది రిలేషన్ షిప్‌లు పెట్టుకోవడానికి కాదు.. ఆట ఆడటానికి అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పిన శ్రీముఖి తాజాగా ఓపెన్ అయింది. శ్రీముఖి ఎప్పుడూ చేసిన ఆట గురించే ఆలోచిస్తూ ఉంటుందని, ఏం చేసినా ఆటను దృష్టిలో పెట్టుకునే ఉంటుందని హౌస్మేట్స్ చెప్పిన సందర్భాలెన్నో.

తాను కూడా రిలేషన్ షిప్‌లో ఉండేదాన్నని, అయితే బ్రేకప్ అయిపోయిందని, ఆ సమయంలో చచ్చిపోదామని అనుకున్నానంటూ తను రియల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. శ్రీముఖి అందరితో కలవకపోవడానికి కారణం కూడా అదే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే బంధాల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఆట మీదే ఫోకస్ పెట్టి ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











