For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నిరకాలుగా నన్ను చూశారు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికీ తెలియని సీక్రెట్ అదే.. శ్రీముఖి కామెంట్స్ వైరల్

    |

    బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాపులర్ అయిన కంటెస్టెంట్లు తక్కువే. అయితే బయట విపరీతమైన పాపులార్టీ ఉండి.. బిగ్‌బాస్‌లో వచ్చిన కంటెస్టెంట్ మాత్రం శ్రీముఖే. బుల్లితెరపై రాములమ్మగా ఓ ఊపు ఊపుతుండగా.. సడెన్‌గా మాయమైపోయింది. బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో దానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైంది. బుల్లితెరపై శ్రీముఖి సందడి తగ్గిపోయిందని ఆమె అభిమానులు నిరాశ చెందినా.. బిగ్‌బాస్ రూపంలో మళ్లీ ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తోందన్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.

    నచ్చిన టాస్క్ అదే..

    నచ్చిన టాస్క్ అదే..

    నాకు బిగ్‌బాస్ హౌస్‌లో ఇటుకల టాస్క్ బాగా నచ్చింది.. సంప్రదాయబద్దమైన కోడలి పాత్ర నాకు నచ్చింది.. ఆ టాస్క్ తరువాత నేను కెప్టెన్‌గా కూడా ఎన్నికయ్యాను. నేను చేసిన టాస్క్‌లు కాకుండా బాబా భాస్కర్ చేసిన బ్యాలెన్సింగ్ టాస్క్‌ను చూస్తూనే ఉండిపోయాను. దాదాపు రెండుగంటల పాటు మాష్టర్ అలానే ఉన్నారు.

    నన్ను అన్ని రకాలుగా చూశారు..

    నన్ను అన్ని రకాలుగా చూశారు..

    ‘నన్ను సంప్రదాయ దుస్తుల్లో చూశారు.. మోడ్రన్ దుస్తుల్లో చూశారు.. అన్ని రకాలుగా చూశారు.. మీ ఇంట్లో అమ్మాయిలా నన్ను ట్రీట్ చేశారు.. నేను ఇక ముందు చేసే షోలు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయి. మీరు తక్కువగా ఫీలయ్యే షోలను నేను చేయను' అని చెప్పుకొచ్చింది.

    మీరున్నారనే ధైర్యం

    మీరున్నారనే ధైర్యం

    హౌస్‌లో దాదాపు నేను 7, 8 సార్లు నామినేట్ అయి ఉంటాను.. అయినా సరే ప్రతీ వారం నాకు ఏదో ఒక నమ్మకం.. మీరంతా ఉన్నారనే ధైర్యం.. సేవ్ అవుతాననే గట్టి నమ్మకం ఉండేది.. నా కోసం నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఎంతో మంది సహకరించారు.

    నా వరకు ఆయనే విన్నర్..

    నా వరకు ఆయనే విన్నర్..

    బిగ్‌బాస్ హౌస్‌లో నా వరకు బాబా భాస్కరే విన్నర్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రతీక్షణం అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చేవాడని, అందరితో జాగ్రత్తగా చూసుకునేవాడని, రుచికరంగా వండిపెట్టేవాడని, టాస్క్‌లో ఫుల్ ఎనర్జీతో పాల్గొనేవాడని చెప్పుకొచ్చింది.

    ఎవ్వరికీ తెలియన సీక్రెట్..

    ఎవ్వరికీ తెలియన సీక్రెట్..

    బిగ్‌బాస్ హౌస్‌లో ఎవ్వరికీ తెలియన సీక్రెట్‌ను శ్రీముఖి బయటపెట్టేసింది. లైట్లు వెలిగినంత సేపు హౌస్‌లో ఎవ్వరూ నిద్రపోకూడదన్న నిబంధన అందరికీ తెలిసిందే. అయితే కనుబొమ్మలు తీసే నెపంతో నిద్రపోయే వాళ్లమని, బిగ్‌‌బాస్‌ను అలా మోసం చేశామని చెప్పుకొచ్చింది. మగవారు కూడా అలానే చేయడం మొదలుపెట్టారు. కానీ మమ్మల్ని బిగ్‌బాస్ కనిపెట్టలేకపోయాడని చెప్పింది.

    English summary
    Sreemukhi Came Into Live On Instagram. She Revealed Interesting Facts. She Tells About Her New Shows. Her Opinion On Rahul, Baba Bhaskar, Varun Sandesh, Ali Reza Etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X