For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్ బాస్ హౌస్‌లో పిసినారి రాణి.. శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి

|

పదో వారానిగానూ చేపట్టిని నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వాగ్వాదాలు, మాటల యుద్దం అనంతరం శ్రీముఖి, రవి, వరుణ్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్ పర్వం పూర్తయింది కాబట్టి.. వారాంతం వరకు ఓ టాస్క్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుుక సిద్దమయ్యాడు.

నామినేషన్ ప్రక్రియలో నువ్వానేనా అన్నంతగా పోట్లాడుకున్న శివజ్యోతి, శ్రీముఖి

నామినేషన్ ప్రక్రియలో నువ్వానేనా అన్నంతగా పోట్లాడుకున్న శివజ్యోతి, శ్రీముఖి

ప్రతీసారి ఏదో కొత్త రకంగా నామినేషన్ ప్రక్రియను చేపడుతున్న బిగ్బాస్.. ఈసారి జంటలుగా విడగొట్టి వారి మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా శివజ్యోతి, శ్రీముఖిని ఒక జంటగా చేసిన బిగ్ బాస్.. వారి మధ్య ఆరని చిచ్చు లేపాడు. ఒకరొకొకరును దూషించుకుంటూ.. నువ్వానేనా అన్నట్టుగా పోటీపడ్డారు. మరి నేటి టాస్క్లో శివజ్యోతి.. శ్రీముఖి ఏవిధంగా ప్రవర్తిస్తారో చూడాలి.

రాణి కానీ.. మహా పిసినారి.. కొడుకులు, కోడళ్లను ఆట ఆడిస్తోంది..

రాణి కానీ.. మహా పిసినారి.. కొడుకులు, కోడళ్లను ఆట ఆడిస్తోంది..

పదోవారానికిగానూ బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో శివజ్యోతిని రాణిని చేశాడు. అయితే తానొక మహా పిసినారి అంటూ తన పాత్ర స్వభావాన్ని తెలిపాడు. ఇక తనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు.. ఒక మేనేజర్ బాబా భాస్కర్ అన్ని పాత్రలను డిసైడ్ చేసేశాడు. ఇక పిసినారి రాణితో ఇంటి సభ్యులు ఎలా వేగుతారో చూడాలి.

అత్తయ్య అంటూ శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి

అత్తయ్య అంటూ శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి

టాస్క్లో భాగంగా ఇంట్లో ఉన్న వితికా, పునర్నవి, శ్రీముఖిలు పిసినారి రాణి అయిన శివజ్యోతికి కోడళ్లుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా వారి అత్తయ్యను కాకపట్టే పనిలో ఆ ముగ్గురు కోడళ్లు ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే అతి వినయం ప్రదర్శిస్తూ.. తన అత్తయ్య అయిన శివజ్యోతి కాళ్లను పట్టుకునేందుకు శ్రీముఖి ప్రయత్నిస్తోంది.

కెప్టెన్సీ టాస్క్‌లో విజేత ఎవరో

కెప్టెన్సీ టాస్క్‌లో విజేత ఎవరో

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో.. కెప్టెన్గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్‌లోని సంఘటనలు ఆసక్తిని రేపుతున్నాయి. దాంతో వినోదంతోపాటు గొడవలు కూడా సమానంగా ఉండటంతో ఈ కార్యక్రమంలో జోష్ పెరిగింది.

English summary
Bigg Boss 3 Telugu Tenth Week Upadate. Sivajyothi Acts As Queen In Bigg Boss Task. She Has Three Sons And Daughter In Laws. Srimukhi Is Also One Of Them. She Try To Impress Her Mother in Law.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more