శ్రీముఖి సైగలు... బాబాకు తగులుతున్న సెగలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకుంటోన్న కొద్దీ.. ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న సైగలే సోషల్ మీడియాలో పెద్దగా అవుతున్నాయి. నిన్నటి కలర్ టాస్క్, చివరకు ఒక్కరే మిగలడం, ఆ ఒక్కరే ఓట్లు అడుక్కునే చాన్స్ ఉండటమనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన కలర్ టాస్క్‌లో శివజ్యోతి, వరుణ్‌పై.. శ్రీముఖి, శివజ్యోతిపై రంగు చల్లిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్, బాబాపై.. అలీ, శ్రీముఖిపై రంగులు చల్లాల్సి ఉండగా.. వారిద్దరి దానికి ఒప్పుకోలేదు. ఫైనలిస్ట్‌గా వెళ్లేందుకు బాబా అర్హుడిని తనకు ఎలాంటి తప్పులు కనిపించడం లేదని వరుణ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే శ్రీముఖిపై కూడా తాను రంగు చల్లనని, తనలో కూడా ఎలాంటి తప్పులు కనిపించలేదని అలీ చెప్పుకొచ్చాడు.
బిగ్‌బాస్ ఆదేశాలతో వెనక్కి తగ్గిన వరుణ్..
అయితే ప్రక్రియ ముందుకు కొనసాగాలంటే చివరకు ఒక్కరే మిగలాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే అక్కడ అలీ శ్రీముఖిపై రంగు పోసే అవకాశమున్నా.. బాబా ముందుకు రావడం వరుణ్ రంగు పోయడం జరిగింది. దీంతో చివరకు మిగిలిన శ్రీముఖి.. నామినేషన్ నుంచి తప్పించమని, ఓట్లు అడిగే అవకాశాన్ని పొందింది.

శ్రీముఖి సైగలు..
బిగ్‌బాస్ ఆదేశించిన పిదప.. బాబాకు శ్రీముఖి సైగలు చేయడం.. బాబా ముందుకు రావడం.. మైకు సరిగా ధరించడం లేదు, తెలుగు మాట్లాడటం లేదంటూ ఏదో కారణాలు చెప్పి వరుణ్ రంగు పోశాడు. శ్రీముఖి చెప్పడంతో బాబా అలా చేయడంపై నెటిజన్లు మండుతున్నారు.

ఫైర్ అవుతున్న నెటిజన్లు..
కంటిచూపుతో బాబాను శాసిస్తోందని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుందని, వయసులో పెద్ద అని కూడా చూడకుండా భాస్కర్ అని పిలవడం, ఏంట్రా అంటూ అమర్యాదగా సంబోధించడంపై బాబా ఫ్యాన్స్ శ్రీముఖిపై మండిపడుతున్నారు. అయితే శ్రీముఖి మాటలు వినడం పట్ల బాబాపై అతని ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











