సావిత్రి ‌x శ్రీముఖి ఫైట్.. వరుణ్ వర్సెస్ వితిక.. గ్యాస్, వాటర్ కట్‌తో లొల్లి

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 10 Highlights || Filmibeat Telugu

తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోలో 10వ రోజు అదే గందరగోళం కొనసాగింది. ఇంటిలో కనీస సదుపాయాలను బిగ్‌బాస్ నిలిపివేసి సెలబ్రిటీలకు షాకిచ్చారు. వరుణ్, రాహుల్, ఇతర ఇంటి సభ్యులు అభ్యర్థిస్తే బిగ్‌బాస్ కనికరించాడు. శివజ్యోతిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కొన్ని టాస్క్‌లకు సంబంధించిన రూల్స్ ఇచ్చారు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తే కనీస సదుపాయాలను తిరిగి ఇస్తామని చెప్పారు. ఇదే టాస్క్ సందర్భంగా సెలబ్రిటీల మధ్య భారీగా గొడవలకు కారణమైంది. వివరాల్లోకి వెళితే..

మినిమమ్ నీడ్స్ కట్

మినిమమ్ నీడ్స్ కట్

బిగ్‌బాస్ హౌస్‌లో గ్యాస్, వాటర్, ఇంటిలో వస్తువుల సదుపాయాలను నిలిపివేశారు. అవి కావాలంటే లాన్‌లోని మూడు సైకిళ్లకు పెట్టిన కార్డుల ప్రకారం వాటిని తొక్కితే .. ఆ బోర్డుకు సంబంధించిన సదుపాయాలు అందజేస్తామని చెప్పారు. ఒక సైకిల్ గ్యాస్, మరో సైకిల్ హౌస్ యాక్సరీస్, మూడో సైకిల్‌కు వాటర్ బోర్డు తగిలించారు. దాంతొ సెలబ్రిటీల మధ్య అవగాహనతో సైకిల్స్ తొక్కడం ప్రారంభించారు.

శివజ్యోతి వర్సెస్ శ్రీముఖి

శివజ్యోతి వర్సెస్ శ్రీముఖి

సైకిల్ తొక్కే విషయంపై శివజ్యోతి, శ్రీముఖి మధ్య గొడవ జరిగింది. దినమంతా నేను సైకిల్ తొక్కాతాను. రాత్రి నిద్రపోతాను అని శ్రీముఖి చెప్పడం శివజ్యోతికి నచ్చలేదు. దాంతో మేము నిద్ర పోవద్దా అని శివజ్యోతి నిలదీసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కలిసి మాటల రువ్వుకోవడంతో పెద్ద వాగ్వాదం జరిగింది.

రవి, తమన్నాల గొడవ

రవి, తమన్నాల గొడవ

ఇక రవికృష్ణకు తమన్నాకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. రవికృష్ణ వ్యాఖ్యలతో తమన్నా చిన్నబోయింది. తనను టార్గెట్ ఎందుకు చేశాడని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇంటి సభ్యులు అలాంటిదేమీ లేదు. రవి మాటలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని సముదాయించడంతో ఆ సమస్య అంతటి ముగిసిపోయింది.

వితిక X పునర్నవి

వితిక X పునర్నవి

ఇక మరో గొడవ వరుణ్ సందేశ్ భార్య వితికకు, పునర్నవికి మధ్య జరిగింది. సైకిల్ టాస్క్‌లో ఎందుకు పార్టిసిపేట్ చేయవు అని పునరన్నవి అడుగగా, నేను కిచెన్ పనులు చేస్తున్నానని వితిక చెప్పింది. అయితే కిచెన్ పని చేస్తే ఎవరు పట్టించుకోరు.. టాస్క్‌లో భాగం కావాలని చెప్పగా.. దానిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వరుణ్ సందేశ్ జోక్యం చేసుకోగా సీరియస్‌గా వితిక హెచ్చరింది.

భోరుమని ఏడ్చిన వితిక

భోరుమని ఏడ్చిన వితిక

పునర్నవి, వితిక మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. దాంతో వారించడానికి వరుణ్ ప్రయత్నించగా నీవు జోక్యం చేసుకోవద్దని చెప్పింది. హాల్‌లో నుంచి లేచి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చింది. దాంతో అందరూ వెళ్లి వితికను ఓదార్చారు. కేవలం నీతో ఉన్న స్నేహం కారణంగానే ఆ విషయం చెప్పానని వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X