Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్‌కు నోట మాట రాలేదు
Recommended Video
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. అయితే గత సీజన్లను చూసేసి.. అక్కడ ఇలా జరిగింది.. కాబట్టి ఇక్కడా అలా జరిగే అవకాశం ఉందంటూ ప్లాన్స్ వేయడం.. ఓ పద్దతిగా ఆడుదామని ఎన్నో ఆలోచనలతో కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెడతారు. అలా వారు ఊహించినట్లు జరిగితే.. అది బిగ్‌బాస్ హౌస్ ఎందుకు అవుతుంది. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఇంటి సభ్యులు అతి తెలివిని చూపిస్తే.. బిగ్‌బాస్ వారికి చుక్కలు చూపించాడు.
పదమూడో వారానికి గానూ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ ఆస్తకికరంగా మారింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. లక్కీ డిప్ ద్వారా చిట్టీలు తీయాలి.. వాటిలో వచ్చిన నంబర్స్ ఆధారంగా వారు గార్డెన్ ఏరియాలో నిల్చొవాలి. చివరి నాలుగు సంఖ్యల్లో ఉన్నవారు నామినేట్ అవుతారని.. అయితే వారు ఆ నంబర్స్‌కు ఎందుకు అర్హులు అవుతారు? మిగతావారు ఎందుకు కారు అంటూ చర్చించుకుని.. స్థానాలను మార్చుకోవచ్చని తెలిపాడు. అయితే రెండో సీజన్లో కూడా ఇలాంటి ఓ టాస్కే ఇచ్చాడు. దానిని అనుసరించి ఆడుదామనుకున్న హౌస్‌మేట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.
రెండో సీజన్లోనూ ఇలాగే..
ఒక నంబర్ వద్ద ఒక్క కంటెస్టెంట్ మాత్రమే ఉండాలని చెప్పగా.. గత సీజన్లో ఒకే నంబర్ వద్ద ఇద్దరున్నారు.. దీంతో వారిద్దర్నీ నామినేషన్లోకి పంపించాడు. దాన్ని అనుసరించి.. నిన్నటి ఎపిసోడ్లో కూడా శివజ్యోతి, వితిక అలాగే ప్రవర్తించారు. కానీ బిగ్‌బాస్ దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.
వరుణ్ తన స్థానాన్ని ఇవ్వడంతో..
మూడో నంబర్లో ఉన్న వరుణ్‌ను మార్చుకోవాల్సిందిగా శివజ్యోతి అడిగింది. అయితే మార్చుకోవడానికి వరుణ్ అంగీకరించలేదు. కానీ వితికా వచ్చి అడగడంతో.. మెడాలియన్ టాస్క్ గెలిచావు కదా అందుకే నేను మార్చుకోవడానికి రెడీ అంటూ తన స్థానాన్ని వితికాకు ఇచ్చాడు. దీంతో ఎసిపోడ్ మొత్తం రచ్చ రచ్చైంది.
ముగ్గురి మధ్య వాగ్వాదం...
భార్య అన్న కారణంతో ఎలా మార్చుకుంటావని.. శివజ్యోతి వరుణ్‌పై ఫైర్ అయింది. టాస్క్‌లో బాగా పర్ఫామ్ చేసింది, మెడాలియన్ కూడా గెలిచింది.. నీ కంటే తనే బెటర్ అని అనిపించింది..పైగా ఆమె నా భార్య అంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు. అలా ఎలా అంటూ.. తన భర్త కూడా వచ్చి ఉంటే.. తనకు కూడా ఇచ్చే వాడంటూ చర్చను ఎక్కడికో తీసుకెళ్లింది. దీంతో మూడో నెంబర్ వద్దే నిల్చుంటానని భీష్మించుకుని కూర్చుంది. అయితే ఇద్దరం అవుదామంటూ మొండి వాదనకు దిగింది.
షాక్ ఇచ్చిన బిగ్ బాస్...
నిబంధనలకు విరుద్దంగా ఆడారని, ఒక నంబర్ వద్ద ఒక్కరే నిల్చోవాలిని చెప్పినా.. మూడో నంబర్ వద్ద ఇద్దరు ఉన్న కారణంగా హౌస్మేట్స్ అందరూ నామినేట్ అయ్యారని షాక్ ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులందరికీ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. శ్రీముఖితో రాహుల్ చేసిన మాటల యుద్దం, బాబా చేసిన త్యాగం అన్నీ వృథా అయ్యాయి. మరి ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.