రంగులతో టాస్క్.. మధ్యలో ఎందుకు వస్తావ్ అంటూ రాహుల్‌పై వరుణ్ ఫైర్
Recommended Video
బిగ్‌బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. షో చూసే ప్రేక్షకులందరినీ మెప్పించి ఓట్లు సంపాదించేందుకు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ చాన్స్ హౌస్మేట్స్ అందరూ చక్కగా వాడుకున్నారు కూడా. వరుణ్, బాబా, అలీ చేసిన టాస్కులకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.

రంగులతో ఆట..
అయితే నేటి ఎపిపోడ్‌లో కూడా ఈ వారం నామినేట్ అయిన సభ్యులందరికీ మరో టాస్క్‌ను ఇచ్చాడు. ఇంతవరకు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల జర్నీని వివరిస్తూ ఎవరు క్లీన్ కాదని అనుకుంటున్నారో వారిపై రంగులు చల్లాల్సి ఉంటుందని తెలిపాడు. కలర్ ఏస్కో లేదా కవర్ చేస్కో.. అంటూ మరో టాస్క్‌ను ఇచ్చినట్టు కనిపిస్తోంది.

రాహుల్‌పై వరుణ్ ఫైర్..
ఈ క్రమంలో ఇంటి సభ్యులందరూ మిగతా హౌస్మేట్స్ తప్పులను ఎత్తి చూపుతూ.. రంగులను చల్లుతున్నట్టు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా శివజ్యోతి, వరుణ్‌లు మాట్లాడుకుంటూ ఉండగా.. మధ్యలో రాహుల్ వచ్చాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఎందుకు వస్తున్నావ్ అన్నట్లుగా రాహుల్‌ను వరుణ్ ప్రశ్నించాడు. తనను సంచాలక్‌గా ఎందుకు నియమించాడంటూ సెటైరికల్‌గా వరుణ్‌పై పంచ్ వేసినట్లు కనిపిస్తోంది. మళ్లీ వీరిద్దరికి ఏదైనా గొడవ జరుగుతుందా? అన్నది చూడాలి.

వరుణ్, బాబా, అలీ టాస్క్‌లపై కామెంట్స్..
నిన్నటి టాస్క్‌లో అందరికంటే ఎక్కువ సేపు వరుణ్ సందేశ్ చేశాడని, దాదాపు మూడు గంటలు పైగా రింగ్‌కు తగలకుండా రాడ్‌ను పట్టుకుని ఉన్నాడని.. రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. బాబా భాస్కరే అందరి కంటే కష్టమైన టాస్క్ ఎంచుకున్నాడని, ఆయనే బాగా చేశాడని బాబా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలీ రెజా కూడా చాలా సమయం బ్యాగులను పట్టుకుని ఉన్నాడని.. మళ్లీ అలీ బ్యాక్ అయ్యాడంటూ అతని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.


Click it and Unblock the Notifications











