twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ను తన ఇంటికి ఆహ్వానించిన వరుణ్ బామ్మ.. పంచ్‌లతో అదరగొట్టేసింది

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Episode 89 Highlights || రాహుల్ కి క్లాస్ తీసుకున్న శ్రీముఖి అమ్మ

    ఒక్కొక్క హౌస్‌మేట్స్‌కు సర్ప్రైజ్ ఇస్తోన్న బిగ్‌బాస్.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు. ఈ పదమూడో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియలో గట్టి షాకే ఇచ్చాడు. శివజ్యోతి చేసిన పనికి అందర్నీ నామినేట్ చేసి పడేశాడు.దీంతో హౌస్‌లో ఉన్న ఏడుగురు నామినేషన్‌లోకి వచ్చేశారు.

    మధ్యలో ప్రత్యేకంగా కొన్నటాస్క్‌లు..

    మధ్యలో ప్రత్యేకంగా కొన్నటాస్క్‌లు..

    అయితే ఈ వారం ప్రత్యేకంగా ఓ టాస్క్ అంటూ పెట్టకుండా.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. అయితే అందర్నీ ఊరికే అలా కలిసే చాన్స్ ఇస్తే అది బిగ్‌బాస్ షో ఎలా అవుతుంది? అతడు బిగ్‌బాస్ ఎందుకు అవుతాడు. మధ్యమధ్యలో వింత వింత టాస్క్‌లు ఇస్తూ.. హౌస్మేట్స్‌ను పరేషాన్ చేశాడు.

    గేటు దాటి వెళ్లిపోయిన బాబా..

    గేటు దాటి వెళ్లిపోయిన బాబా..

    ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలి, స్లీప్ మోడ్, ఫాస్ట్ మోడ్, మ్యూజిక్ వస్తే డ్యాన్సులు చేయాలంటూ టాస్క్‌లు ఇస్తూ.. ఫ్యామిలీ మెంబర్స్‌ను ప్రవేశ పెట్టాడు. మళ్లీ వెళ్లేటప్పుడు కూడా షాక్ ఇస్తూ.. చివరి వీడ్కోలు చెప్పకుండా చేద్దామని ప్రయత్నించాడు. చివరి క్షణంలో మళ్లీ కలిసేలా చేసేవాడు. ఈ క్రమంలో బాబా భాస్కర్ ఓ అడుగు ముందుకు వేసి గేటు దాటి వెళ్లిపోయాడు.

    బిగ్‌బాస్‌ను ఇంటికి ఆహ్వానించిన బామ్మ

    అయితే నేటి ఎపిసోడ్‌లో వరుణ్, రాహుల్, శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ అందరిలో వరుణ్ తరుపున వచ్చిన బామ్మ అందర్నీ ఎంటర్టైన్ చేసింది. బిగ్‌బాస్‌కు కూడా పంచులేసింది. ఆయన్ను ఇంటికి ఆహ్వానించింది.. బిగ్‌బాస్ గారు మీరు మా ఇంటికి రావాలి.. లేదంటే కనీసం ఫోటో అయిన పంపించిన పర్లేదు..అంటూ అందర్నీ నవ్వించింది. కన్ఫెషన్ రూమ్‌లోవాళ్ల అమ్మను చూసి రాహుల్ ఎమోషనల్ అయ్యాడు.

    శ్రీముఖికి షాక్...

    శ్రీముఖికి షాక్...

    అయితే అందరి పరిస్థతి బాగానే ఉంది.. అందరూ తమ కుటుంబ సభ్యులను చూసి ఆనందించారు. శ్రీముఖికి మాత్రం గట్టి షాక్ తగిలినట్లైంది. ఫ్రీజ్ మోడ్‌లో ఉన్న శ్రీముఖి.. కదిలిందనే విషయంలో అమ్మను కలిసేందుకు అనుమతి ఇవ్వనట్లు కనిపిస్తోంది. దీంతో శ్రీముఖి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. మరి చివరకు ఏం జరిగిందనేది చూడాలి.

    English summary
    Bigg Boss 3 Telugu 13th Week updates. All housemates Family Members Visiting Bigg Boss House. In Yesterday Episode Sivajyothi, Baba Bhaskar Families Entered Into House. Today Episode Varun, rahul And Srimukhi Families Enters Into House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X