అందరి గుండెల్ని టచ్ చేసిన వరుణ్.. తన భార్య గురించి గొప్పగా చెప్పిన రియల్ హీరో

నిన్నటి లైఫ్ గ్రాఫ్ టాస్క్‌ను అర్థాంతరంగా ముగించాడని కొందరు కామెంట్లు కూడా చేశారు. కేవలం వితికా, శివజ్యోతి, బాబా భాస్కర్‌ల లైఫ్ గ్రాఫ్ గురించి మాత్రమే చూపించాడు. మిగతా వారందరివి చూపించలేదు. దీంతో కొందరు అసహనానికి లోనయ్యారు. ఈ మాత్రం దానికి టాస్క్ ఎందుకు పెట్టావంటూ బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యాడు.

 అలా జీవితంలోకి వచ్చిన వితికా

అలా జీవితంలోకి వచ్చిన వితికా

అయితే వరుణ్ తన లైఫ్ గ్రాఫ్ గురించి చెబుతూ అందర్నీ ఎమోషనల్ అయ్యేట్టు చేశాడు. తన జీవితంలో కొత్తబంగారు లోకం అనే సినిమా పీక్స్ అయితే.. తరువాత తాను కిందకి దిగుతూనే వచ్చానని తెలిపాడు. సినిమాలు సరిగా ఆడకు అట్టడగు స్థాయికి చేరుకున్నానని తెలిపాడు. పడ్డానండి ప్రేమలో సినిమాతో వితికా తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాక మళ్లీ తన లైఫ్ బాగుందని తెలిపాడు.

 తనే జీవితం..

తనే జీవితం..

వితికా తనకు ఓ ఫ్రెండ్, అమ్మ, నాన్న ఇలా తనే జీవితంలా మారిందని చెప్పుకొచ్చాడు. తానెప్పుడైనా వెనకడుగు వేద్దామనే ఆలోచన వచ్చినా.. వితికా ధైర్యం చెబుతూ ముందుంది నడిపిస్తుందని చెప్పాడు. తన జీవితంలో ఎంత అట్టడుగు స్థాయికి వెళ్లినా తనతో ఉందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికీ ఎత్తుపల్లాలే..

ఇప్పటికీ ఎత్తుపల్లాలే..

తనకు ఒదిగి ఉండటమే తన ఫ్యామిలీ నేర్పిందని.. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా తలకు ఎక్కించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఎవరినీ సహాయం అడగలేను.. నీకేంటి.. నువు వరుణ్ సందేశ్ అంటారు.. అలాంటి సమయంలో మా పేరెంట్స్ మాకు అండగా నిలబడ్డారు. ఇప్పటికీ తన జీవితం ఇంకా ఎత్తుపల్లాల మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలిపాడు.

వరుణ్ స్పీచ్‌పై ప్రశంసలు..

వరుణ్ తన భార్య గురించి ఎంత గొప్పగా చెప్పాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భార్యాభర్తలంటే అలా ఉండాలంటూ మరొకొందరు ట్వీట్ చేస్తున్నారు. వరుణ్ సందేశ్ ఎంతో నిజాయితీగా మాట్లాడాడంటూ ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X