నీకే ఉందా పెళ్లాం అంటూ శివజ్యోతి ఫైర్.. జీవితంలో మాట్లాడకు అంటూ రాహుల్‌పై శ్రీముఖి ఫైర్

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 87 Highlights || అలీ రెజా వైఫ్ సర్‌ప్రైజ్‌ విజిట్

పదమూడో వారానికి గానూ బిగ్ బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ వేడి ఇంకా చల్లారలేదు. వరుణ్, వితికా, బాబా, శ్రీముఖి ఒక్కచోట.. అలీ, శివజ్యోతి, రాహుల్ మరోచోట చేరి టాస్క్ గురించి, అందులో జరిగిన తప్పొప్పుల గురించి చర్చించుకున్నారు. మరోసారి రాహుల్, వరుణ్ మధ్య అరమరికరలు ఏర్పడినట్లు కనిపిస్తోంది.

గ్రూపులో మారిన సభ్యులు...

గ్రూపులో మారిన సభ్యులు...

మొన్నటి వరకు బాబా, అలీ, శ్రీముఖి, శివజ్యోతి ఒక్క జట్టుగా.. వరుణ్, రాహుల్, వితికా ఇంకో జట్టుగా కొనసాగారు. అయితే నిన్నటి నామినేషన్ ప్రక్రియ మరో చిచ్చు పెట్టింది. రాహుల్, వరుణ్‌ల మధ్య కాస్త దూరం పెరిగినట్టు కనిపిస్తోంది. వితికాకు అలవాటు అయిన విధంగా ఎప్పుడూ చేసేలానే రాహుల్ గురించి శ్రీముఖితో చర్చించడం, తనను బ్యాడ్ చేసేలా ఏదో ఒకటి వాగడం చేసింది.

నీకే ఉన్నారా పెళ్లాలు..

నీకే ఉన్నారా పెళ్లాలు..

తనను కంత్రి అన్నాడని. అది మా ఆయన చూస్తే బాధపడడా అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.. ఆయనకే ఉన్నారా పెళ్లాలు అంటూ వరుణ్‌పై ఫైర్ అయింది. ఇక ఈ విషయం గురించి అలీ, శివజ్యోతి, రాహుల్ చర్చించుకుంటూ ఉన్నారు. అయితే అలా మధ్యలో వెళ్లడం తప్పని వరుణ్‌కు చెప్పానని.. శివజ్యోతి వార్నింగ్ ఇవ్వడం వల్లే మధ్యలో వచ్చానని చెప్పినట్లు రాహుల్ తెలిపాడు.

నాతో జీవితంలో మాట్లాడకు..

నాతో జీవితంలో మాట్లాడకు..

నామినేషన్ ప్రక్రియ నీకు అర్థమైందా? శ్రీముఖి అంటూ రాహుల్ ప్రశ్నించగా.. బిగ్ బాస్ అయ్యేంత వరకు.. అయిపోయిన తరువాత జీవితంలో కూడా నాతో మాట్లాడకు.. నేను కూడా నీతో మాట్లాడను అంటూ శ్రీముఖి చెప్పింది. నాక్కూడా నీతో మాట్లాడలనే ఇంట్రస్ట్ లేదంటూ రాహుల్ కౌంటర్ వేశాడు.

శ్రీముఖికి బాబా పంచ్

శ్రీముఖికి బాబా పంచ్

ఉదయం పూట వరుణ్, వితికా, రాహుల్ ముచ్చటించుకున్నారు. నామినేషన్ ప్రక్రియను ఎందుకు రద్దు చేశారంటూ వరుణ్, వితికాను అడిగాడు. జ్యోతి వచ్చి అలా నిల్చోవడం వల్లే రద్దైందని తెలిపారు. అనంతరం శ్రీముఖి వద్దకు వెళ్లిన వితికా.. రాహుల్ మాట్లాడిన మాటలను, మళ్లీ గయ్యాలి గంప అన్నాడని చెప్పింది. ఇక ఇదే విషయాన్ని బాబాతో చెపుకొచ్చిన శ్రీముఖికి పంచ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడేం చేద్దాం అని కౌంటర్ వేశాడు. నేను అలా వెనకాల మాట్లాడటం లేదు కదా అంటూ శ్రీముఖి అనగా.. నువ్వు గ్రేట్ అని బాబా మరో పంచ్ వేశాడు.

బిగ్ బాస్ హోటల్..

బిగ్ బాస్ హోటల్..

బిగ్ బాస్ హోటల్ ఒకప్పుడు సెవెన్ స్టార్ హోటల్‌గా ఉన్నా.. కొన్ని పరిస్థితుల వల్ల స్టార్స్‌ను కోల్పోవలసి వచ్చిందని.. వాటిని తిరిగి తెచ్చేందుకు హౌస్ మేట్స్ అందరూ టాస్క్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. బిగ్ బాస్ హోటల్ మేనేజర్‌గా వరుణ్, వంటవాళ్లుగా బాబా, శ్రీముఖి, వితిక.. సర్వర్లుగా రాహుల్, అలీ, శివజ్యోతిలుగా వ్యవహరిస్తారని తెలిపాడు. మధ్య మధ్యలో కొన్ని టాస్క్‌లు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఏం జరిగినా వాటిని కొనసాగిస్తూనే ఉండాలని తెలిపాడు. మధ్యలో వచ్చే అతిథులు స్టార్స్ ఇస్తారని, అందుకోసం వారికి సేవలు చేయవలసి ఉంటుందన తెలిపాడు.

మొదటి అతిథిగా విచ్చేసిన వితికా సోదరి..

మొదటి అతిథిగా విచ్చేసిన వితికా సోదరి..

హౌస్ చుట్టు గార్డెన్ ఏరియాలో మార్చ్ చేస్తుండగా.. వితికా సోదరి ఎంటర్ అయింది. అయినా వారు టాస్క్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వితికా ఏడ్చుకుంటూనే మార్చ్ చేస్తూ ఉంది. అనంతరం రిలీజ్ అని చెప్పగానే వితికా తన సోదరిని గట్టిగా హత్తుకుని ఏడ్చింది. అనంతరం బయట జరిగే విషయాలను చెప్పింది.. ప్రస్తుతం ఎలా ఆడుతున్నారో ఇకపై కూడా అలానే ఆడమని సలహా ఇచ్చింది. పునర్నవి అందర్నీ అడినట్లు చెప్పమందని తెలిపింది. అనంతరం రెండో అతిథిగా అలీ భార్య ఎంట్రీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X