Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాబాను భలే ఇరికించిన వరుణ్ బ్యాచ్.. శ్రీముఖి ఇప్పటికైనా కళ్లు తెరువు..
బిగ్ బాస్ చేపట్టిన నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఎవరి మనుసులో ఏముందో తెలిసేట్టు చేశాడు. కెప్టెన్ మినహా మిగిలిన వారందర్నీ జట్టుగా చేసిన బిగ్ బాస్.. శివజ్యోతి, శ్రీముఖిలను ఒక జంటగా విడగొట్టాడు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో.. వీరిద్దరితోపాటు ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం హైలెట్‌గా నిలిచింది. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా వారి మధ్య విభేదాలు, కుమ్ములాటలు బహిర్గతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
ముందు నుంచి శివజ్యోతిని టార్గెట్ చేసిన వరుణ్ బ్యాచ్
వరుణ్, పున్ను, వితికా, రాహుల్ నామినేషన్ గురించి మాట్టాడుకుంటూ ఉంటారు. వరుణ్ అయితే తన ధ్యాసను ఎప్పుడూ నామినేషన్స్ పైనే ఉంచుతాడు. ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారు..? మనం ఎవర్ని నామినేట్ చేయాలంటూ డిస్కస్ చేస్తూ ఉంటాడు. శివ జ్యోతిని ఇంతవరకు ఎవరూ నామినేట్ చేయలేదంటూ పదే పదే చెప్పుకొచ్చాడు. నిన్నటి ప్రక్రియలో వరుణ్ గ్యాంగ్ శివజ్యోతిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
బాబాను మెడకు చుట్టేద్దామని ప్లాన్..
నామినేషన్లో భాగంగా ఎవరుండాలి? ఎవరు పోవాలి? ఎవరికి అర్హతలున్నాయి? అంటూ వాగ్వాదం చేసుకున్నారు. వారి మాటల యుద్దానికి హౌస్ దద్దరిల్లిపోయింది. అంతా జరిగిన నామినేట్ అవడం వారి చేతుల్లో లేదు. అది ఇంటి సభ్యులు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఆ గ్యాంగ్ ప్లాన్ వేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వరుణ్ శ్రీముఖికి ఓటు వేసి.. బాబాను ఇరకాటంలో నెట్టాడు..
రవి, మహేష్ , రాహుల్ శివజ్యోతికి ఓటు వేశారు.. వితికా, పున్ను శ్రీముఖికి ఓటు వేశారు. వరుణ్ శ్రీముఖికి ఓటు వేయడంతో సరి సమానంగా వచ్చేశాయి. చివరగా బాబా ఎవరికి ఓటు వేస్తారో వారే సేవ్ అవుతారు.. మిగిలిన వ్యక్తి నామినేట్ కావాల్సి వస్తుంది. అయితే బాబా కచ్చితంగా.. శ్రీముఖికే ఓటు వేస్తాడని వారు భావించి ఉండొచ్చు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన ఓటును శివజ్యోతికి ఓటు వేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఆ నలుగురు నామినేషన్లో
బాబా భాస్కర్ నిర్ణయం శ్రీముఖికి కూడా ఖంగుతిన్నట్టైంది. ఇక శ్రీముఖి కళ్లు తెరిపించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఎలాంటి వారో తెలిసేలా చేశారని అంటున్నారు. కాగా, ఈ వారం నామినేషన్లో శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణ, వరుణ్ సందేశ్ ఉన్నారు.