ఆపుకోలేకపోయిన బాబా.. తోసేసిన వితికా.. స్మార్ట్ గా ఆడావంటూ వరుణ్ పొగడ్తలు
Recommended Video
బిగ్ బాస్ పదకొండో వారంలో పెట్టాల్సిన పరీక్షలు నేటితో పూర్తయ్యాయి. నామినేషన్ ప్రక్రియ అంటూ రాళ్లే రత్నాలు అనే ఆట ఆడించాడు. అటుపై బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ అంటూ కుళాయి కొట్లాట, ప్రిజ్మా బ్యాలెన్స్ ఫ్రేమ్, రిక్షాలో వీర విహారం అనే ఆటలు ఆడించాడు.

రిక్షాలో వీర విహారం..
గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రిక్షాలో ఎవరు ఎక్కవ సేపు కూర్చుంటే.. వారే విజేతలని ప్రకటించాడు. అయితే మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చిన వారికి మద్దతు తెలపవచ్చు, అయితే రిక్షాలోంచి లాగకూడదు, తోయకూడదు అని కండీషన్ పెట్టాడు.

మేకప్ వేసిన శ్రీముఖి, రాహుల్
రిక్షాలో కూర్చున్న బాబాకు లిప్ స్టిక్ పెట్టింది.. బాబాకు, వితికాకు రాహుల్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ సెట్ చేశాడు. అనంతరం వారిద్దరూ మూడు స్వెటర్లు వేసుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం శ్రీముఖి వారిద్దరికీ షేవింగ్ ఫోమ్ రాసింది. అనంతరం పది మిర్చిలను తినాలనే టాస్క్ ఇచ్చాడు. అతి కష్టం మీద వాటిని తినేశారు.

ఆపుకోలేకపోయిన బాబా..
ఆపై యాపీ ఫిజ్ డ్రింక్ ను తాగాలని తెలిపాడు. దాన్ని కూడా వారు తాగేశారు. ఇక చివరకు బాబాకు అర్జెంట్ అంటూ.. వితికాను కొంచెం ముందుకు జరగమన్నాడు. అయితే రిక్షాలోనే తాను కానిచ్చేస్తాను అని తెలిపాడు. దీనికి వితికా నిరాకరించింది. ఆ సమయంలో బాబా నిల్చొని ఉండటంతో.. బయటకు తోసేసింది. దీంతో బాబా మొదటగా రిక్షాను దిగేశాడు.

వితికాను పొగిడిన భర్త..
అయితే అలా తోయడం అనే రూల్ లేదని చర్చించసాగారు. అనంతరం వితికా గెలిచినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే మెడల్ వితికా దగ్గరకు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని తెలిపాడు. బాబాను తోసేసి స్మార్ట్ గా ఆడావంటూ వరుణ్ వితికాను పొగిడాడు. నా పక్కనే అలా చేస్తానని అనేసరికి.. నాకు నచ్చలేదు.. నాక్కూడా వస్తోంది అయినా నేను ఆపుకుంటున్న కదా.. అంటూ బాబా తోసేయడాన్ని వితికా సమర్థించుకుంటుంది. ఆ ఘటనతో బాబా కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి తన తెలివితో వితికా మెడల్ ను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











