Don't Miss!
- News జనంలోనే జగన్: నియోజకవర్గాల్లో సభలు.. అక్కడే బస
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
వరుణ్ మీదకు ఎక్కిన వితిక.. నడుము విరగడంతో అరిచిన వరుణ్
బిగ్ బాస్ హౌస్‌లో పదమూడో వారం కూడా ముగిసేందుకు వచ్చింది. కంటెస్టెంట్లందరికీ ఫ్యామిలీ టచ్ ఇచ్చి ఎమోషనల్ అయ్యేట్టు చేశాడు. తన హోటల్‌కు తిరిగి సెవెన్ స్టార్ స్టేటస్‌ను తెప్పించుకున్నాడు. ఏడుగురు కంటెస్టెంట్లకు సంబంధించి ఏడుగురు అతిథులు వచ్చి సెవెన్ స్టార్స్‌ను ఇచ్చారు.
ఫ్యామిలీ టచ్ ఇచ్చిన బిగ్‌బాస్..
నామినేషన్ ప్రక్రియ అనంతరం మొదలుపెట్టిన ఈ టాస్క్ వారం మొత్తం సాగింది. కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు. దాదాపు మూడు నెలల పాటు దూరంగా ఇంటి సభ్యులను చూసిన కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. మధ్యమధ్యలో టాస్క్‌లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ కూడా చేశాడు.
ఎంటర్టైన్ చేసిన బామ్మ
వితిక తరుపున ఆమె సోదరి, అలీ భార్య, శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ ఫ్యామిలీ, వరుణ్ బామ్మ, రాహుల్.. శ్రీముఖి అమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిని చూసిన హౌస్మేట్స్ కన్నీరుమున్నీరయ్యారు. అందరిలో కెల్లా వరుణ్ బామ్మ అందర్నీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. బిగ్‌బాస్‌ను తమ ఇంటికి ఆహ్వానించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇష్టమొచ్చిన పాత్రలను..
నేటి ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌కు మరో డిఫరెంట్ టాస్క్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి నచ్చిన క్యారెక్టర్లను పోషించమని బిగ్‌బాస్ ఆదేశించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు రాహుల్ కాంచనగా, అలీ గజినీగా, శ్రీముఖి మహానటి సావిత్రిగా, శివజ్యోతి చంద్రముఖిలో జ్యోతిక పాత్రను, వితిక, వరుణ్.. దేవసేన, బాహుబలి పాత్రలను పోషించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాహుబలిలో ఎంతో ఫేమస్ అయిన షాట్‌ను వారు ట్రై చేశారు.
బాహుబలి సీన్ స్పూఫ్..
దేవసేన పడవ ఎక్కే సమయంలో ప్రభాస్ కూర్చోవడం.. అతని భుజాలపై నుంచి నడుచుకుంటూ పడవ ఎక్కే సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అలాంటి సీన్‌ను కోర్ట్ యార్డ్‌లో వరుణ్, వితికా ట్రై చేశారు. ఈ క్రమంలో వరుణ్పైకి వితిక ఎక్కింది. అయితే ఆమె బరువు మోయలేకపోవడంతో వితికా స్లిప్ అయింది.. వరుణ్ మీద పడింది. దీంతో అమ్మా అనుకుంటూ నడుమును పట్టుకున్నాడు. మరి నిజంగానే వరుణ్‌కు పెద్ద గాయమైందా లేదా తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.