ఓ సెంటిమెంట్‌ను శ్రీముఖి నిజం చేస్తే.. మరోదాన్ని రాహుల్ బ్రేక్ చేశాడు.. ఇంతకీ అవేంటంటే..?
బిగ్‌బాస్ షో ముగిసేందుకు సమయం వచ్చింది. ఎంతో అట్టహాసంగా మొదలైన ఈ సీజన్ అంతే గ్రాండ్‌గా ముగియనుంది. ఈ ఫినాలె ఎపిసోడ్ ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండబోతోన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. నిధి అదిరిపోయే అందాలు, రాశీ ఖన్నా, మారుతి, శ్రీకాంత్, అంజలి లాంటి తారాగణాల ఎంట్రీతో ఫినాలే స్టేజ్ దద్దరిల్లబోతోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరూ ఫినాలే వేదికపై స్టెప్పులేసి అందర్నీ అలరించేందుకు సిద్దమయ్యారు.

సోషల్ మీడియాలో వింత లెక్కలు..
ఓ వైపు ఆ హడావిడి జరుగుతూ ఉంటే మరోవైపు విన్నర్ రాహుల్, రన్నర్ శ్రీముఖి అని వార్తలు వైలర్ కాసాగాయి. సందట్లో సడేమియా అన్నట్లు గత సీజన్‌లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. వాటికి, ప్రస్తుతం జరుగుతున్న వాటికి ముడిపెడుతూ ఏవో లెక్కలు వేసేస్తున్నారు. వినడానికి అవి కాస్త ఆసక్తిగా ఉండటంతో సోషల్ మీడియాలో అందరూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు.

అందుకే శ్రీముఖి రన్నర్..
శ్రీముఖి పచ్చ బొట్టు వేసుకోవడం వల్లే రన్నర్‌గా మిగిలిపోయిందని, గత సీజన్‌లో కూడా గీతా మాధురి బిగ్‌బాస్ చిహ్నాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ శ్రీముఖిని విన్నర్ కాకుండా చేసిందని వింత లెక్కలు కడుతున్నారు.

సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన రాహుల్..
మరో వైపు రాహుల్ ఓ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడని కామెంట్లు పెడుతున్నారు. గత సీజన్‌లో టాప్5లో మొదటగా చేరుకున్న సామ్రాట్ ఫస్ట్ ఎలిమినేషన్‌ను ఫేస్ చేయడంతో.. అదే సెంటిమెంట్ కంటిన్యూ అయి రాహుల్ కూడా ఫస్టే ఎలిమినేట్ అవుతారని అప్పట్లో కామెంట్లు చేశారు కొందరు. కానీ వాటన్నంటిని తలకిందులు చేస్తూ రాహుల్ విన్నర్‌గా నిలిచాడని అతని ఫాలోవర్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.

వాటని నమ్మొద్దంటూ నాగ్..
బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని నాగ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. విన్నర్ ఎవరన్నది లైవ్ టెలికాస్ట్‌లో చూడండి.. బయట వినిపించేవి నమ్మకండని కోరాడు. దీంతో మళ్లీ కొందరిలో అనుమానాలు రేకెత్తాయి. నిన్న రాత్రి నుంచి రాహుల్ గెలిచాడనే వార్తలు వైరల్ కాగా.. ప్రస్తుతం నాగ్ చేసిన ప్రకటనతో మరింత గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తతో శ్రీముఖి ఫ్యాన్స్ కొత్త ఊపు వచ్చింది. మళ్లీ ట్వీట్లతో ట్రెండ్ చేస్తూ.. టైటిల్ గెలవడానికి శ్రీముఖికే అర్హత ఉందంటూ హ్యాష్ ట్యాగ్‌లతో హోరెత్తిస్తున్నారు. మరి విన్నర్ ఎవరన్నది స్పష్టంగా తెలియాలంటే నేటి ఫినాలె ఎపిసోడ్‌ను చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











