పగబట్టిన బిగ్‌బాస్.. గుండె పగిలేలా రోధిస్తున్న శ్రీముఖి

పదమూడో వారంలో ఇంటి సభ్యులందరికీ ఫ్యామిలీ టచ్ ఇస్తోన్న బిగ్ బాస్... వారి వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను కలిసే చాన్స్ ఇస్తున్నాడు. ఇదే టాస్క్‌తో ఈ వారం అంతా గడిచిపోయేలా ఉంది. అయితే ఈ టాస్క్‌లోనే కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మరి కొన్ని టాస్కులను కూడా ఆడిస్తున్నాడు.

మధ్య మధ్యలో టాస్క్‌లు..

మధ్య మధ్యలో టాస్క్‌లు..

ఫాస్ట్ ఫాస్ట్‌గా పనులు చేయాలి, నిల్చున్న చోట నుంచి కదలకూడదు, మ్యూజిక్ వస్తే డ్యాన్సులు చేయడం, స్లీప్ మోడ్ అంటూ ఇలా రకరకాల టాస్క్‌లను ఆడించాడు. అయితే హౌస్మేట్స్ ఈ టాస్క్‌లను ఆడిస్తూ ఉండగానే మధ్యలో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపించాడు.

మార్చ్ చేస్తుండగా వితికా సోదరి ఎంట్రీ...

ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో మార్చ్ చేస్తుండగా.. వితికా సోదరి ఎంట్రీ ఇచ్చింది. అయినా సరే ఏడుస్తూనే.. టాస్క్‌ను ఆపకుండా కంటిన్యూ చేసింది. చివరకు రిలీజ్ అని చెప్పడంతో వెంటనే గట్టిగా హత్తుకుంది. అలాగే స్లీప్ మోడ్‌లో అలీ ఉండగా.. తన భార్య హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశాడు. స్లీప్ మోడ్‌లో ఉన్న అలీని.. గట్టిగా హత్తుకుంది. చివరకు వెళ్లే సమయంలో కూడా ఫ్రీజ్ అంటూ విడగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయితే చివరి క్షణంలో రిలీజ్ అని చెప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి.. గేట్ వద్దే హత్తుకున్నాడు.

భర్తను చూసి కన్నీరుమున్నీరు...

ఫ్రీజ్ మోడ్‌లో ఉన్నప్పుడు శివజ్యోతి భర్త గంగూలిని హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. అయితే ఒక్కసారిగా భర్తను చూసిన శివజ్యోతి కన్నీరుమున్నీరైంది. భర్త ఎంత ఓదారుస్తున్నా.. కన్నీరును ఆపుకోలేకపోయింది. సేమ్ అలీ విషయంలో చేసినట్టుగా చివరి క్షణంలో అందర్నీ స్లీప్ మోడ్ చేసేశాడు. చివర్లో మళ్లీ రిలీజ్ అనడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది.

గేటు దాటి బయటకు వెళ్లిన బాబా...

బాబా భాస్కర్ విషయంలోనే అంతే.. అందర్నీ ఫ్రీజ్ మోడ్ చేసేసి.. ఆయన ఫ్యామిలీని ఎంట్రీ అయ్యేలా చేశాడు. మొదటగా ఆయన పిల్లలు రాగా.. కొద్ది సేపటి తరువాత ఆయన భార్య కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే బాబా విషయంలోనూ అలానే చేసిన బిగ్‌బాస్.. బాబా భాస్కర్ గేటు దాటుకుని మరీ వెళ్లాడు.

నేటి ఎపిసోడ్‌లో శ్రీముఖికి షాక్

అందరి ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్లోకి పంపిస్తున్న బిగ్‌బాస్.. శ్రీముఖి విషయంలో మాత్రం గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో శ్రీముఖి గుండె పగిలేలా ఏడుస్తోంది. శ్రీముఖి వాళ్ల అమ్మ కోర్ట్ యార్డ్లో ఉండగా.. ఫ్రీజ్ మోడ్‌లో ఉన్న శ్రీముఖి నిబంధనను ఉల్లంఘించినందుకు తన తల్లిని కలిసే అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. మళ్లీ శ్రీముఖి వద్దకు తన తల్లిని పంపించాడా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X