twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ విన్నరా... మజాకా..? ఏకంగా బెంజ్ కారునే కొనేశాడు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

    |

    బిగ్‌బాస్ తెలుగులో మూడో సీజన్ వైరల్ అయినంతంగా మిగతా ఏ సీజన్ వైరల్ కాలేదు. ఎక్కువగా నెగెటివిటీ లేకుండా ఉండటం కూడా అందుకు ఓ కారణం. మూడో సీజన్ కంటెస్టెంట్లకు వచ్చిన పేరు మిగతా సీజన్ల కంటెస్టెంట్లకు రాకపోవడం విచిత్రమే. మూడో సీజన్‌లో పాల్గొన్న సభ్యులందరికీ దాదాపు మంచి క్రేజే లభించింది. ఓ ఇద్దరు ముగ్గుర తప్పా మిగతా వారంతా సెలెబ్రిటీ స్టేటస్‌ను తెచ్చుకుని బయటపడ్డవారే. ముఖ్యంగా విజేతగా నిలిచిన రాహుల్, రన్నర్‌గా ఆగిపోయిన శ్రీముఖికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

    శ్రీముఖితో గొడవ.. పున్నుతో రిలేషన్..

    శ్రీముఖితో గొడవ.. పున్నుతో రిలేషన్..

    బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటినుంచి మొదలైన రాహుల్-పునర్నవి స్నేహం చివరి వరకు కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.వీరిద్దరి కెమిస్ట్రీనే సీజన్ మొత్తానికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇదంతా ఓ వైపు అయితే శ్రీముఖితో గొడవ రాహుల్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇలా ఓ వైపు స్నేహం, మరోవైపు శతృత్వంతో రాహుల్‌ను విజేతగా నిలబెట్టేలా చేశాయి.

    సొంతింటి కల..

    సొంతింటి కల..

    బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిస్తే తమ తదుపరి లక్ష్యాలేంటి? అని ఇంటి సభ్యులు పలు సందర్భాల్లో ముచ్చటించుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రాహుల్ తన మనసులోని మాట చెప్పుకొస్తూ.. ఓ సొంతిల్లు కొనాలి, ఓ అల్ట్రా మోడ్రన్ సెలూన్ పెట్టాలని తన కోరికల చిట్టా విప్పాడు. అయితే చివరకు రాహుల్ విన్నర్‌గా నిలవడం, ప్రైజ్ మనీని గెలవడం జరిగిపోయాయి.

    అదే కోరికను పలు ఇంటర్వ్యూలోనూ..

    అదే కోరికను పలు ఇంటర్వ్యూలోనూ..

    బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తరువాత ఎంతో బిజీగా గడిపిన రాహుల్.. పలు ఇంటర్వ్యూల్లోనూ అదే కోరికను వెల్లిబుచ్చాడు. ఓ సొంతిల్లు కొనాలి.. ఎన్నో యేళ్ల నుంచి అద్దింట్లోనే ఉంటున్నామని చెప్పుకొచ్చాడు. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చాక పాటలు పాడుతూ, సినిమాల్లో నటిస్తూ.. పలు స్టేజ్‌ షోలు చేస్తూ ఎంతో బిజీగా గడిపేస్తున్న రాహుల్ బెంజ్ కారును కొనేశాడు.

    రాహుల్ ఫోటోలు వైరల్

    రాహుల్ ఫోటోలు వైరల్

    సింగర్‌గా బిజీ అవ్వడమే కాకుండా సినిమాలు, పలు స్టేజ్‌లతో బాగానే సంపాదిస్తోన్న రాహుల్... బెంజ్ కారుకు కొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోలకు హిమజ, నోయెల్, రోహిణి కామెంట్లు చేస్తూ కంగ్రాట్స్ తెలిపారు. ఇక చిచ్చా ఫ్యాన్స్ మాత్రం ఖుషీలో మునిగిపోయారు.

    English summary
    Bigg Boss 3 Telugu Winner Rahul Sipligunj Buys Benz Car. Rahul Sipligunj And His New Benz car Pics Goes Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X