మంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్.. అందుకోసమేనని నెటిజన్ల కామెంట్లు.. వైరలవుతోన్న పిక్
బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. దావత్‌లు చేసుకుంటూ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ను కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా తెలంగాణ మంత్రిని కలిశాడు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో రాహుల్ షేర్ చేశాడు. దీంతో ఆ పిక్ తెగ వైరల్ కాసాగింది.

పునర్నవితో స్నేహం..
హౌస్‌లో మొదటి నుంచి ఓ గ్రూప్‌గా ఉన్న పీవీవీఆర్(పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్)కు ఎంతో క్రేజ్ ఏర్పడింది. వీరి స్నేహాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అందులోనూ ముఖ్యంగా పునర్నవి, రాహుల్ మధ్య కెమెస్ట్రీపై అందరూ ప్రత్యేక శ్రద్దను చూపించారు. పునర్నవితో నడిపిన ఆ రహస్య బంధమే రాహుల్‌కు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

టాప్5లో మొదటగా..
బిగ్‌బాస్ హౌస్‌లో అందరి కంటే ముందుగా టాప్5లో చోటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు రాహుల్. టికెట్ టు ఫినాలె చేజిక్కించుకుని ఫైనల్‌కు బెర్త్ కన్ఫమ్ చేసుకున్నాడు. తన నిజాయితితో, ముక్కుసూటితనంతో, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేతత్త్వంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. వారందరి మద్దతుతో బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచాడు.
చిరు చేతుల మీదుగా ట్రోఫీ
బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్, ట్రోఫీ అందుకున్నాడు. అనంతరం వేదికపైనే ఎమోషనల్ అయ్యాడు. తనకు సపోర్ట్ చేసిన అందరికీ పాదాభివందనాలు తెలియజేశాడు. విన్నర్‌గా నిలిచిన రాహుల్.. పలు మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

తలసానిని కలిసిన రాహుల్..
తాజాగా తెలంగాణ మంత్రి తలసాని యాదవ్‌ను రాహుల్ కలిశాడు. డైనమిక్ లీడర్.. డౌన్ టు ఎర్త్ అంటూ తలసానిని పొగిడేశాడు. ఆయన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని పోస్ట్ చేశాడు. అయితే రాజకీయాల్లోకి వస్తాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ విజేతగా నిలిచినందుకు మర్యాదపూర్వకంగా కలిసి ఉంటాడని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











