హేమను టార్గెట్ చేస్తూ జోరుగా గొడవలు.. కర్రోడా అంటే కడిగిపాడేసిన మహేష్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 మూడో రోజు కార్యక్రమంలో సెలబ్రీటల మధ్య గొడవలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం హ్యాపీగా ప్రారంభమైన ఈ షోలో గందరగోళం నెలకొన్నది. హేమ, ఇతర సభ్యుల మధ్య గట్టిగానే వాగ్వాదాలు జరిగాయి. దాంతో ఇంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో ఇంట్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకొన్నాయి. ఒకరికి ఇంకోకరికి మధ్య గొడవలు అప్పుడే మొదలయ్యాయి. నటి హేమ, హిమజ మధ్య మాటల యుద్ధం ఊపందుకొన్నది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంటి సభ్యుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది. మూడో రోజు ఏం జరిగిందంటే..

చిన్నపిల్లల్లా ఇంటి సభ్యులు

చిన్నపిల్లల్లా ఇంటి సభ్యులు

బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సరదా సరదా సాగే ఆటను టాస్క్‌గా బిగ్‌బాస్ ఇచ్చారు. సెలబ్రిటీలందరూ చిన్న పిల్లల మాదిరిగా మారిపోయి అల్లరి చేశారు. టాస్క్‌లో భాగంగా సెలబ్రిటీలు కిడ్స్ మాదిరిగా తమ ప్రదర్శన ఆకట్టుకొన్నారు. టాస్క్ చిన్న చిన్న తుంటరి అంశాలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ టాస్క్‌కు పునర్ నవి టీచర్‌గా వ్యవహరించారు. బాబా భాస్కర్‌ను సిగరెట్ తాగకుండా ఆపడంలో ఇంటి సభ్యులు సక్సెస్ అయ్యారు.

మహేష్‌ విట్టాను కర్రోడా అంటూ

మహేష్‌ విట్టాను కర్రోడా అంటూ

ఆ తర్వాత రవికృష్ణ, మహేష్ విట్ట మధ్య గొడవ చోటు చేసుకొన్నది. మహేష్‌ను ఉద్దేశించి కర్రోడా అంటూ పిలిచే సరికి ఆయన మండిపడ్డారు. రవికృష్ణను ఉద్దేశించి నీవు చదువుకొన్నవాడివేనా అంటూ మహేష్ విట్ట ఫైర్ అయ్యాడు. చదువుకొన్న వాడు పక్కన ఉండే వాడిని అలా పిలువరు అని క్లాస్ పీకాడు. ఇలా బాడీ షేమింగ్‌పై మహేష్ దీటుగా స్పందించే సరికి రవికృష్ణ కామ్ అయ్యారు.

ఫుడ్ విషయంలో మనస్పర్ధలు..

ఫుడ్ విషయంలో మనస్పర్ధలు..

ఫుడ్ విషయంలో సెలబ్రిటీల మధ్య మనస్పర్ధలు
ఫుడ్ విషయంలో ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్న హేమతో, రాహుల్, అలీ రాజా, శ్రీముఖి గొడవ జరిగింది. మూడు రోజులపాటు ఫుడ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని హేమ చెప్పడంపై కొందరు వ్యతిరేకించారు. హేమతో రాహుల్‌ వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య మాటలు జోరు పెరిగింది. దాంతో ఎదుటివాళ్లు చెప్పాలని రాహుల్ నిలదీశాడు.

ఎవరి వ్యూహం వారిదే

ఎవరి వ్యూహం వారిదే

శ్రీముఖి, వరుణ్ సందేశ్, హిమజ ఇతర సెలబ్రీటీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించింది. ఎవరి వ్యూహాలతో వారు ఉన్నట్టు వ్యవహరించారు. అందరి దృష్టి ఇక హేమపైనే ఉంది. హేమను అక్కా అంటూనే కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో హేమ కూడా సహనం కోల్పోయేలా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X