Bigg boss 4:నా మంచికే జరిగింది.. లేకుంటే బతుకు బిస్కెట్ అయ్యేది.. లాస్యతో అభి

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదు గాని అభిజిత్, మోనాల్ మధ్య మరో ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మోనాల్ విషయంలో ప్రతి సారి తొందరపడినట్లు ఫీల్ అవుతున్న అభిజిత్ ఆమె మాయలో పడకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ వర్కౌట్ కావడం లేదు. ఇక గురువారం ఎపిసోడ్ లో లాస్య, నోయల్ తో కూరగాయలు కట్ చేస్తూ మాట్లాడిన అభిజిత్ లోలోపల చాలా అనుకున్నాడు.

షో మొదలైనప్పటి నుంచి కూడా అబిజిత్ మోనాల్ పై ప్రేమను చాలానే పెంచుకున్నాడు. మోనాల్ కి డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా ఆ విషయం ఎప్పుడో అర్ధమయ్యింది. తెలిసినప్పటికీ మళ్ళీ అఖిల్ ని లైన్ లో పెట్టిన సుడిగాడు పాప ఇద్దరి మధ్య తెలియకుండానే చిచ్చు పెట్టేసింది. నామినేషన్ ప్రక్రియ మొదలైంది అంటే చాలు అఖిల్, అభిజిత్ పోటాపోటీగా నామినేట్ చేసుకునే వరకు వచ్చింది.

Bigg boss 4 Abhijeet shocking comments on monal gajjar behavior

ఇక రీసెంట్ గా నోయల్, లాస్య, అబిజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా నోయల్, మోనాల్ గురించి మాట్లాడాడు. ఆమెతో ఎవరు సరిగ్గా మాట్లాడడం లేదట. హగ్ కూడా చేసుకోవడం లేదని, ముఖ్యంగా లాస్య దూరంగా ఉంటోందని బాధపడినట్లు తనతో చెప్పిందని నోయల్ అన్నాడు. అలాగే నాతో కూడా మాట్లాడడం లేదని నోయల్ చెప్పగా ఏం జరిగినా మన మంచికే అంటూ అబిజిత్ నోట్లోనే కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నాడు.

నాతో అయితే అసలే మాటలు లేవు కదా.. నేను ఎలా ఉండాలి. నిజంగా ఏం జరిగినా మన మంచికే. లేదంటే నా బతుకు బిస్కెట్ అయ్యేది.. అంటూ అబిజిత్ మోనాల్ పై కౌంటర్ వేశాడు. దీంతో అబిజిత్, మోనాల్ పై ఏ స్థాయిలో కోపంగా ఉన్నాడో క్లియర్ గా అర్ధమయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X