దొరికిందే ఛాన్స్... మోనాల్ మనసులో చిచ్చు రేపిన అబిజిత్..
బిగ్ బాస్ సీజన్ లో 4లో ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త లవ్ డ్రామా స్టోరీకి ఒక్కో సారి ఎండ్ కార్డ్ పడుతుందేమోనని అనిపిస్తుంటుంది కానీ మారికొన్ని సార్లు మాత్రం ఎవరు ఊహించని విధంగా రొమాంటిక్ సీన్స్ తో షాక్ ఇస్తుంటారు. ఇక అభిజిత్ చాలా రోజుల తరువాత మోనాల్ తో ముచ్చట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దొరికిందే ఛాన్స్ అని అభి ఆమె మనసులో ఒక చిచ్చు కూడా రేపాడు.

ఆమెను టార్గెట్ చేస్తూ..
మోనాల్ అంటే మొదట్లో అభిజిత్ ఎంతగా లైక్ చేసేవాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆమె అఖిల్ తో క్లోజ్ అయిన తరువాత మెల్లగా ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. మధ్యలో ఫాలో అయ్యాడు గాని మళ్ళీ ఎందుకో డ్రాప్ అయ్యాడు. ఇక ఆ తరువాత ఆమెను టార్గెట్ చేస్తూ చీటర్ అంటూ ముద్ర వేశాడు. అంతే కాకుండా ఒక నడకపై సెటైర్లు వేస్తూ జంతువులతో పోల్చడం స్టార్ట్ చేశాడు.

ఎప్పుడైతే మోనాల్ ని నామినేట్ చేశాడో..
అయితే చాలా రోజుల తరువాత అభిజిత్ మోనాల్ తో కలిసి ముచ్చట్లు పెడుతూ కనిపించాడు. అఖిల్ ఎప్పుడైతే మోనాల్ ని నామినేట్ చేశాడో అప్పటి నుంచి అందరూ షాక్ కి గురయ్యారు. బిగ్గెస్ట్ సస్పెన్స్ గా ఉన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదని అమ్మా రాజశేఖర్ అయితే ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.

మోనాల్ ని మెల్లగా రెచ్చగొట్టే ప్రయత్నం
ఇక సందు దొరికిందని మోనాల్ ని మెల్లగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అభిజిత్. ఆమెను ఓదార్చినట్టు కనిపిస్తూనే అందరూ నిన్ను ఎలా టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. సోఫాలో మోనాల్ తో ముచ్చట్లు పెట్టిన విధానం కంటెస్టెంట్స్ లలో పలు అనుమానాలకు దారి తీసింది. అయితే గతంలో అభిజిత్ ఒకసారి మోనాల్ ని నామినేట్ చేసిమ విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు.

వివరణ ఇచ్చిన మోనాల్
ఇక మోనాల్ మళ్ళీ బాదపడుతూనే మాజీ క్రష్ కి వివరణ ఇచ్చింది. నేను వీక్.. ఏదైనా సరే పోరాడకుండా ఓటమిని అంగీకరిస్తానని వాళ్ళ అభిప్రాయం. అది నిజమే కావచ్చు. అందుకే నేను మిస్టరీ గర్ల్ ని అంటూ వివరణ ఇవ్వగా.. అభిజిత్ మాత్రం అందుకు భిన్నంగా స్పంధించడం హాట్ టాపిక్ గా మారింది.

మోనాల్ ను బాగానే డిస్టర్బ్ చేశాడు.
నేను అయితే అలా చేయను. ఎంతైనా ఆడపిల్లవి కదా.. కనీసం అలా కూడా వాళ్ళు ఆలోచించలేదు. నిజంగా నాకు ఆ పద్ధతి నచ్చలేదు.. అంటూ మోనాల్ మనసును బాగానే డిస్టర్బ్ చేశాడు. అంతా బాగానే ఉంది కాని మొన్నటి వరకు మోనాల్ అంటే అసహ్యించుకున్న అభిజిత్, అఖిల్ అలా చేయగానే వెంటనే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయడం వైరల్ అయ్యింది. మరి ముందు ముందు ఇంకెలాంటి రంగులు మారుస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











