మోనాల్, అఖిల్ కౌగిలింతను చూసి పక్కకు వెళ్ళిపోయిన అభిజిత్.. ఎలిమినేషన్ ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేషన్స్ ఊహించని ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ మారుతున్నాయి. ప్రతి వారం నాగార్జున ఒక రోజు సరదాగా ఉంటూ మరో రోజు ఎలిమినేషన్స్ ప్రక్రియతో షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆల్ మోస్ట్ అమ్మా రాజశేఖర్ వెళ్లిపోతాడాని అందరికి ముందే అర్ధమయ్యింది. ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ లో ఉన్నప్పటికీ ఎదో ఒక రకంగా సేవ్ అవుతున్న మాస్టర్ ఆదివారం మాత్రం వెళ్లిపోక తప్ప లేదు.

చివరలో అవినాష్, అమ్మా, మోనాల్ ఉన్నప్పుడు వారి మధ్య జరిగిన ఎలిమినేషన్ లో ఉహీంచని ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురికి ఇచ్చిన మూడు కార్డులలో ఎవరికి ఒకే రకమైన ఫ్రూట్ వస్తుందో వాళ్ళు సేవ్ అని చెప్పగా మొదట అమ్మా ఆ తరువాత అవినాష్ డేంజర్ జోన్ లోకి వెళ్లగా అరటి పండు ఉన్న కార్డులు మూడు రావడంతో మోనాల్ సేవ్ అయ్యింది. అయితే అప్పుడే అభిజిత్, అఖిల్ ఆమెకు కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్లగా.. అఖిల్, మోనాల్ ని గట్టిగా కౌగిలించుకున్నాడు.

bigg boss 4 abhijeet upset on Akhil monal emotional scene

ఆ సీన్ చూసిన అభిజిత్ వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు. అందరు కంగ్రాట్స్ చేయడానికి వెళ్లగా.. కొంచెం స్పేస్ ఇవ్వండని చెప్పి పక్కకు తప్పుకున్నాడు. ఆ సీన్ హౌజ్ లో ఎవరు అంతగా గమనించకపోయినా కూడా ఆడియెన్స్ కి మాత్రం చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఎలిమినేషన్ కి రావడానికి కారణమైన అఖిల్ , మోనాల్ కి దూరం అవుతున్నట్లు అనిపించింది. అభిజిత్ మళ్ళీ ఆమెకు దగ్గరవుతున్నట్లు అనిపించింది. మరి రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X