అందుకే మోనాల్‌ని నామినేట్ చేశా.. అఖిల్ సమాధానంకు నాగార్జున ఫిదా

బిగ్ బాస్ లో ఎవరు ఎంత హైలెట్ అయినా కూడా మోనాల్ టాపిక్ వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవుతోంది. మోనాల్, అఖిల్ ప్రస్తావన వస్తే చాలు.. మరో కారణం కనిపించదు. వారిద్దరి మధ్య ఎమోషనల్ గొడవలు. లేదంటే ప్రేమ ముచ్చట్లు తప్పితే మరో విషయంలో హైలెట్ అవ్వలేదు. ఇక మోనాల్ ని అఖిల్ నామినేట్ చేయడానికి అసలు సమాధానం ఇవ్వగా అందుకు నాగార్జున కూడా ఫిదా అయ్యారు.

అఖిల్ అలా చేస్తాడని అనుకోలేదు

అఖిల్ అలా చేస్తాడని అనుకోలేదు

శనివారం ఎపిసోడ్ లో మోనాల్ మళ్ళీ తనదైన శైలిలో ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అఖిల్ నా ఫ్యామిలీ పర్సన్ అనుకున్నా. అతను నన్ను నామినేట్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. అతనితో ప్రాబ్లమ్ ఏమిటో అర్థం కాలేదు. వెళ్లి అడిగాను కూడా. అందుకు అతని నుంచి సరైన సమాధానం కూడా రాలేదని మోనాల్ వివరణ ఇచ్చింది.

అసలు సమాధానం ఇచ్చిన అఖిల్

అసలు సమాధానం ఇచ్చిన అఖిల్

ఇక ఎందుకు నామినేట్ చేశావ్ అని అడగడంతో అఖిల్ తన సమాధానం ఇచ్చాడు. హౌజ్ లో పరిస్థితులు చాలా మారాయి సార్. గతంలో మాదిరిగా లేవు. అందుకే ఇన్ని రోజులు నామినేట్ చేయలేదు. టాస్క్ లలో ఆమె బాగా ఆడడం లేదని అనిపించింది. కేర్ టెకర్ గేమ్ లో కూడా సరిగ్గా ఆడలేదు. ఇన్ని రోజులు తను ఏం చేసినా కూడా వెనకేసుకుంటూ వచ్చానని చెప్పాడు.

అలా చేయడం వల్ల స్ట్రాంగ్ అయ్యింది

అలా చేయడం వల్ల స్ట్రాంగ్ అయ్యింది

అయితే అలా ఆమెను సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఎప్పటికి స్ట్రాంగ్ అవ్వలేదు. నేను నామినేట్ చేయడానికి బలమైన కారణం ఉంది. ఎప్పుడైతే అలా చేశానో ఆ తరువాత మోనాల్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఫేస్ కాపాడుకునే టాస్క్ లో ఆమె చాలా బలంగా ఆడింది. లేకపోతే ఆ గేమ్ కూడా సరిగ్గా ఆడేది కాదు. ఆమె హౌజ్ లో ఉంది అంటే అందుకు కారణం నేనే అంటూ అఖిల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

చివరికి హగ్ చేసుకున్న మోనాల్, అఖిల్

చివరికి హగ్ చేసుకున్న మోనాల్, అఖిల్

ఇక అఖిల్ ఇచ్చిన వివరణతో నాగార్జున కూడా ఫిదా అయ్యారు. నిజంగా అఖిల్ ఇచ్చిన ఆన్సర్ చాలా కరెక్ట్ అని చెప్పి చెప్పారు. ఇక చివరగా ఆమె జస్ట్ ఒక ఫ్రెండా లేక అంతకంటే ఎక్కువనా? అని నాగ్ ప్రశ్నించగా.. అందుకు అఖిల్ జస్ట్ ఫ్రెండ్ అని సమాధానం ఇచ్చారు. ఇక మోనాల్ కూడా అదే తరహాలో ఫ్రెండ్ అని సమాధాన ఇచ్చింది. ఇక అతను వెలిగే దీపం అంటూ బిరుదు కూడా ఇచ్చింది. దాంతో మరోసారి ఇద్దరు హగ్ చేసుకొని కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X