అఖిల్‌కు మోనాల్ గండం.. ముందు జాగ్రత్తగా తప్పించుకున్న అభిజిత్, లవ్ ట్రాక్ ఎండ్!
బిగ్ బాస్ సీజన్ 4లో లవ్ ట్రాక్ అనేది చాలా డిఫరెంట్ గా క్రియేట్ అయ్యింది. గత సీజన్స్ లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ లో ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఓ వర్గం వారికి మంచి కిక్కిచ్చింది. ఎక్కడ కూడా తగ్గకుండా మోనాల్ చేస్తున్న రిస్క్ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఆమె మాయల్ పడే అఖిల్ బలయ్యేలా ఉన్నాడని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో అఖిల్ కూడా ఉన్నాడు.

తెలివిగా ప్రవర్తిస్తున్న అభిజిత్
షో స్టార్ట్ అయినప్పటి నుంచి అభిజిత్, మోనాల్, అఖిల్.. వీరి మధ్య జరుగుతున్న పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిజిత్ కాస్త సైలెంట్ కుర్రాడు కాబట్టి అఖిల్ కొన్నిసార్లు కోప్పడినా రెచ్చగొట్టినా కూడా రిస్క్ చేయలేదు. ఓపికతోనే సమాధానం చెబుతూ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటున్నాడు. కానీ అఖిల్ మాత్రం ఈజీగా దొరికేస్తున్నాడు.

అభిజిత్ పై ఎంత కోప్పడినా కూడా..
సోహైల్ తరువాత హౌజ్ లో అతనికంటే ఎక్కువ కోపం ఉన్న వాళ్లలో అఖిల్ ఒకరు. కానీ అఖిల్ ఇంతవరకు ఆ విషయంలో ఎక్కువగా హైలెట్ కాలేదు. అబిజిత్ ని చాలా సార్లు రెచ్చగొట్టాడు. గత వారం కుండలతో డ్రమ్ములు నింపే టాస్క్ లో మెహబూబ్ డ్రమ్ములు పడేస్తుండగా అబిజిత్ తో కాదురా దమ్ముంటే ఇప్పుడు వచ్చి నాతో పోటీ పడు అని సెటైర్ వేశాడు. అప్పుడు అభి సైలెంట్ గానే ఉన్నాడు.

అఖిల్ మోసపోతున్నాడు
ఇక మంగళవారం ఎపిసోడ్ లో ప్రతివారం జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పెట్టాలని అఖిల్ అభిజిత్ తో మాట్లాడడానికి వెళ్ళాడు. కానీ అభి ఇప్పుడు వద్దు రేపు మాట్లాడదామని చెప్పాడు. అయితే నిజానికి అభి మోనాల్ కి ఎప్పుడో దూరమయ్యాడు. ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంకా అఖిల్ ఒక్కడే ఆమె కన్నీళ్లకు మోసపోతున్నట్లు టాక్ వస్తోంది.

ప్రేమదేశం కథకు ఎండ్ కార్డ్
అభిజిత్ కూడా మోనాల్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినా కూడా పట్టించుకోలేదు. ఇక ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో వీరిమధ్య ఏం చర్చ జరగనుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రేమదేశం కథకు ఎండ్ కార్డ్ పడవచ్చని కూడా టాక్ వస్తోంది. అయితే ఏం చేసినా కూడా అఖిల్ ఇంకా మోనాల్ తోనే ఉంటే ఎలిమినేషన్స్ లో అతనే బలయ్యేలా ఉన్నాడని కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











