మోనాల్ కంటే అఖిల్ చిన్నవాడు.. వారికి పెళ్లి అయ్యే ఛాన్స్ లేదు: క్లారిటీ ఇచ్చిన అఖిల్ తల్లి
బిగ్ బాస్4 లో కంటెస్టెంట్స్ అందరు కూడా విభిన్న రకాలుగా వారి పర్ఫెమెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా ట్రాక్ మార్చడం లేదు. అందులో అఖిల్ ఒకరు. మనోడు ఇంతవరకు మోనాల్ తో ప్రేమ వ్యవహారం తప్పితే పెద్దగా పొడిచింది ఏమి లేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మోనాల్, అఖిల్ బయటకు వస్తే పెళ్లి చేసుకుంటారనే కామెంట్స్ కి అఖిల్ తల్లి ఊహించని విధంగా చెక్ పెట్టారు.

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తున్నాడు
షో మొదటి నుంచి కూడా అఖిల్ ఒకే రకమైన టాలెంట్ ని చూపిస్తున్నాడు. అమ్మా రాజశేఖర్, అవినాష్, లాస్య అలాగే సోహైల్, ఆఖరికి మెహబూబ్ కూడా తన స్కిల్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. కానీ అఖిల్ మాత్రం ఇంకా మోనాల్ ప్రేమ చుట్టే తిరుగుతున్నాడు. పైగా డైలీ సీరియల్స్ కంటే మితిమీరిన ఎపిసోడ్స్ తో కొన్నిసార్లు చిరాకు కూడా తెప్పిస్తున్నాడు.

స్పందించిన మోనాల్ తల్లి
ఇక మోనాల్ ని ఇటీవల నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఎలాగోలా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి అయితే తప్పించుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అఖిల్ పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి అతని తల్లి ఒక వివరణ ఇచ్చారు. అఖిల్ , మోనాల్ మధ్యలో కేవలం స్నేహం మాత్రమే ఉంది. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటున్నారు.

మోనాల్ తో పెళ్లి.. అలా ఎన్నటికి జరగదు
ఇంకా ఏమన్నారంటే.. పొరపాటున అఖిల్ , మోనాల్ వివాహం చేసుకోవాలి అన్న సెట్టవ్వడం కష్టమని అన్నారు. ఎందుకంటే అతని వయసు 25 మాత్రమే. ఇక మోనాల్ మూడు పదుల వయసు దాటేసింది. అలాంటిది వీరిద్దరికి సెట్టవ్వడం అనేది అంత ఈజీ కాదని అర్ధమవుతోందని అన్నారు. పైగా తన కొడుకు ప్రేమ వ్యవహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటాడని కూడా ఆమె చెప్పడం విశేషం.

అది అసలు లవ్వే కాదట..
అది లవ్వు కాదు.. గివ్వు కాదు. ఇద్దరు కూడా షోలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని కూడా అఖిల్ తల్లి వివరణ ఇవ్వడం వైరల్ అవుతోంది. ఆమె మాటలకు భిన్నంగా అఖిల్ ప్రతి రోజు మోనాల్ ప్రస్తావన లేనిది ఉండడు. పోటీగా లవర్ బాయ్ అభిజిత్ ఉన్నా కూడా మోనాల్ ని చాలా సార్లు తనవైపుకు తిప్పుకున్నాడు. మరి ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











