అభిజిత్ ఎంత చీ కొట్టినా మోనాల్ ఆ విషయంలో అతన్ని వదలదు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్

వీకెండ్స్ లో నాగార్జున ఎంట్రీతో బిగ్ బాస్ లో ఎదో ఒక జోష్ కనిపిస్తోంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కూడా శని ఆదివారాల్లో మాత్రం నాగార్జున హోస్ట్ గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ లో నాగార్జున చాలా స్పెషల్ గా కనిపించారు. హౌజ్ మెంట్స్ కి అమలా అక్కినేని పంపించిన బహుమతులు కూడా ఇచ్చారు. ఇక అఖిల్ ద్వారా ఇచ్చిన ట్విస్టులతో షోలో ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

అఖిల్ కు కెప్టెన్ బాధ్యతలు

అఖిల్ కు కెప్టెన్ బాధ్యతలు

బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ ద్వారా సీక్రెట్ రూమ్ ని బాగానే వాడారు. షోకి ఇది ఎంతవరకు బూస్ట్ ఇచ్చిందో తెలియదు గాని అఖిల్ మాత్రం తన మాటలతో పెర్ఫెమెన్స్ తో మాత్రం బాగానే హైలెట్ అయ్యాడు. ఇక హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతాడాని అనుకున్న సమయంలో చివరలో నాగార్జున ఇచ్చిన ట్విస్టుతో సేవ్ అయ్యాడు. అంతేకాకుండా కెప్టెన్ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడు.

కడిగిపారేసిన అఖిల్..

కడిగిపారేసిన అఖిల్..

అఖిల్ ఇన్ని రోజులు సీక్రెట్ రూమ్ లో ఉంటూ పంచ్ లు, జోకులు వేసిన వారిని కడిగిపారేశాడు. ముఖ్యంగా అభిజిత్, లాస్య, హారికలపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు అఖిల్. ఒక మనిషి హౌజ్ లో లేకపోతే అంత చులకనగా చేస్తారా? మంచి చెడు ఎం ఆలోచించారా అంటూ ఫైర్ అయ్యాడు. అఖిల్ వారన్న ప్రతి మాటను కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని మరి కౌంటర్ ఇచ్చాడు.

అభిజిత్ పై ఫైర్ అయిన అఖిల్

అభిజిత్ పై ఫైర్ అయిన అఖిల్

అఖిల్ తనపై సింపథి, ఫేక్ అనే పదాలను వాడడం కరెక్ట్ కాదని అంటూ.. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి మొత్తం పచ్చగానే కనిపిస్తోందని, అలాగే నువ్ ఫేక్ కాబట్టి నీకు అందరు ఫేక్ గా కనిపిస్తారని గరమయ్యాడు అఖిల్. లాస్య జోకులు వేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ హౌజ్ లో లేకపోతే అలాంటి కామెంట్స్ తనపై ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు అఖిల్.

నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేశావ్..

నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేశావ్..

ఇక హారిక సింపథి కార్డులు పని చేయవని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసిన అఖిల్ ఆమెకు కూడా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ఇక హై హెట్ యూ అనే పదాన్ని గుర్తు చేస్తూ.. అసలు నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేశావని అంటూ మరో షాక్ ఇచ్చాడు అఖిల్. మీ మాటలకు అవతలి వ్యక్తులు ఎంత బాధపడుతున్నారు అనే విషయాన్ని వదిలేశారని అఖిల్ మనోవేదనకు గురయ్యాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
అభిజిత్ ఎంత చీ కొడుతున్నా..

అభిజిత్ ఎంత చీ కొడుతున్నా..

ఒక విధంగా అఖిల్ గట్టిగా ఎడ్చేశాడు. ఇక సోహైల్, మోనాల్ ల గురించి అఖిల్ చాలా పాజిటివ్ గా మాట్లాడాడు అఖిల్. నేను సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు బాధపడింది వాళ్లేనని.. ముఖ్యంగా మోనాల్ చాలా మంచిదని అన్నాడు. ఆమె ఎంత మంచిదంటే అభిజిత్ ఎంత చీ కొడుతున్నా కూడా అతని విషయంలో నెగిటివ్ గా ఉండదని అన్నాడు. ఆ విధంగా ఉండే వారు తనకు ఇష్టమైన స్నేహితులు అని అఖిల్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X