Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒక్క రోజుకే చేతులెత్తేసిన సమంత.. బిగ్ బాస్ విషయంలో నాగార్జున మరో కీలక నిర్ణయం!
బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగానే కొనసాగుతోంది. మధ్యమధ్యలో రేటింగ్స్ తగ్గినప్పటికీ వీకెండ్స్ లో ఒక్కసారిగా మళ్ళీ రసవత్తరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ దసరా సందర్భంగా అక్కినేని నాగార్జున బ్రేక్ తీసుకోగా సమంత రంగంలోకి దిగి హోస్ట్ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. స్టార్ మా సమంత హోస్ట్ విషయంలో సంతృప్తి చెందలేదనే కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ రేటింగ్స్ పరంగా ఆ రోజు స్టార్ మాకి మంచి లాభాలే వచ్చాయట.
ఇక సమంత వల్ల కాదట
ఇక మళ్ళీ అదే తరహాలో మరుసటి వారం కూడా సమంత హోస్ట్ బాధ్యతను తన భుజాలపై వేసుకుంటుందా లేదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం హిమాలయ కొండల్లో ఉన్న నాగార్జున ఒక వారం అయితే కొడలితో అడ్జస్ట్ చేశాడు గాని రానున్న వీకెండ్ కి మాత్రం మళ్ళీ అది కుదరదట. సమంత ఒక్క ఎపిసోడ్ కె ఎండ్ కార్డ్ పెట్టేసినట్లు టాక్ వస్తోంది.
నాగార్జున చెప్పినప్పటికీ.. డ్రాప్ అయిన సమంత
అసలైతే ఈ వారం కూడా కోడలితోనే కానిచ్చేయమని నిర్వాహకులకు నాగ్ సలహా ఇవ్వగా అందుకే సమంత మాత్రం ఒప్పుకోలేదని రూమర్స్ వస్తున్నాయి. షోకి కనెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదని చాలా ఒత్తిడితో కూడుకున్న పని అంటూ సమంత చేతులెత్తేసిందట. ఇక నాగార్జున అందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైల్డ్ డాగ్ షూటింగ్ లో మార్పులు
ఇక ఫైనల్ గా వైల్డ్ డాగ్ టీమ్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేయక తప్పలేదట. వారానికి 5రోజులు మాత్రమే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట. అవసరం అయితే రోజుకు 8గంటలు చేసే బదులు 12గంటలు షూటింగ్ చేసేలా షెడ్యూల్ ని రెడీ చేయమని చెప్పారట. సాధారణంగా నాగార్జున సాయంత్రం 6 దాటితే షూటింగ్స్ లో పెద్దగా పాల్గొనరు. కానీ బిగ్ బాస్ వల్ల ఇప్పుడు ఆ రూల్ బి బ్రేక్ చేయాల్సి వస్తోంది.
మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్
శని ఆదివారాల్లో నాగార్జున మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ చాలా క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో నాగార్జున ఏ మాత్రం మిస్ కావద్దని బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి కూడా పేరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ చేసుకొని మరోవైపు బిగ్ బాస్ హోస్టింగ్ అంటూ.. నాగార్జున చాలా కష్టపడుతున్నాడట. శుక్రవారం షూటింగ్ అయిపోగానే శనివారం లొకేషన్ కి చేరుకొని బిగ్ బాస్ షూట్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.