మోనాల్ ప్రేమలపై మాస్టర్ హెచ్చరిక.. వెళ్తూ వెళ్తూ వాళ్ళ మోసంపై కామెంట్స్
అనుకున్నట్లే అమ్మా రాజశేఖర్ హౌజ్ నుంచి వెళ్ళిపోయాడు. గత వారం నుంచే ఎలిమినేషన్స్ కి సంబంధించిన అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఆల్ మోస్ట్ అమ్మా రాజశేఖర్ వెళ్లిపోతాడాని అందరికి అర్ధమయ్యింది. ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ లో ఉన్నప్పటికీ ఎదో ఒక రకంగా సేవ్ అవుతున్న మాస్టర్ ఆదివారం మాత్రం వెళ్లిపోక తప్ప లేదు. ఇక ఫైనల్ గా వెళ్తూ వెళ్తూ మాస్టర్ అందరి గురించి మాట్లాడాడు. అసలు - నకిలీ అని టాస్క్ లో కంటెస్టెంట్స్ గురించి క్లియర్ గా వివరణ ఇచ్చారు.
Recommended Video

కంటెస్టెంట్స్ ఎమోషనల్
గత వారం ఎలిమినేషన్ లో అభిజిత్, హరిక, మోనాల్, అమ్మా రాజశేఖర్, అవినాష్ ఉన్న విషయం తెలిసిందే. ఇక శనివారం ఎపిసోడ్ లో కమల్ హాసన్ ద్వారా హారిక సేవ్ అయిన విషయం తెలిసిందే. అనంతరం. మిగిలిన వారిలో ఒక్కొక్కరిగా సేవ్ అవ్వగా చివరికి అమ్మా రాజశేఖర్, అవినాష్ మిగిలారు. చివరి 10 నిమిషాలు కంటెస్టెంట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు.

అసలు ఎవరు - నకిలీ ఎవరు
అందరు ఊహించినట్లే అమ్మా రాజశేఖర్ ఏలిమినేట్ అయ్యారు. ఒక చిన్న ఆట ఆడించి చివరకు అమ్మను స్టేజ్ పైకి వచ్చేలా చేశారు నాగార్జున. అసలు - నకిలీ అని టాస్క్ లో కంటెస్టెంట్స్ గురించి క్లియర్ గా వివరణ ఇచ్చారు మాస్టర్. సోహైల్, అరియానా, లాస్య, అవినాష్, మెహబూబ్, మోనాల్ వీళ్లంతా మంచి వాళ్ళని ఒక పద్దతిగా గేమ్ ఆడుతున్నారని.. అసలు వీళ్లేనని చెప్పాడు.

హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉండాలి
ఇక అనుకున్నట్లుగానే అభిజిత్, అఖిల్ లను మొదట విలన్ గా చేసేశారు అమ్మా. హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉండాలి కదా అంటూ అభిజిత్ ఫోటోను నకిలీ లిస్ట్ లో చేర్చారు. టాస్క్ లను తప్పించుకుంటాడు. గేమ్ ఆడడు.. అలా ఉండకూడదు అంటూ చురకలు అంటించారు. ఇక అఖిల్ మంచి ఫ్యామిలీ పర్సన్ అంటూనే ఎలిమినేషన్ లో తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా గొడవ లేదని అన్నారు. ఇక హారిక గురించి కూడా అదే చెబుతూ నకిలీ అనేశాడు.

మోనాల్ కి హెచ్చరిక
మోనాల్ కి ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరిని కూడా స్ట్రాంగ్ గా నమ్మవద్దు. బయట ఉన్నప్పుడు ఎవరు నీ పక్కన ఉన్నారో వాళ్ళను నమ్ము. కానీ హౌజ్ లో గేమ్ పై ఎక్కువగా ఫోకస్ చేయి. ఇక్కడ సేఫ్ గేమ్ ఉండదు. మనకు ఈ లైఫ్ లో యాక్టింగ్ రాదు. నువ్వు నేను ఒక్కటే. అందుకే మనకు గిఫ్ట్స్ కూడా రాలేదని చెప్పిన అమ్మా రాజశేఖర్.. అఖిల్, అభిజిత్ వంటి వారిని నమ్మవద్దని చెప్పినట్లు అర్ధమయ్యింది. గత వారం అఖిల్ మోనాల్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











