Bigg boss 4: ఆ విషయంలో తొందరపడి తన గొయ్యి తానే తవ్వుకుంటున్న అమ్మా రాజశేఖర్

బిగ్ బాస్ హౌజ్ లో రోజుకో గొడవతో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా హౌజ్ లో పరిస్థితులు ఒక్కరిపైనే తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమ్మా రాజశేఖర్ ప్రతి విషయంలోని బలి అవుతున్నాడు. ఇక గురువారం ఎపిసోడ్ లో అమ్మా ప్రవర్తించిన తీరు అతని ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది.

 ఒక్క అమ్మా రాజశేఖర్ తప్ప.

ఒక్క అమ్మా రాజశేఖర్ తప్ప.

హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు.. ఒక్క అమ్మా రాజశేఖర్ తప్ప. పరిస్థితి ఏదైనా కూడా చివరికి ఆయనపైనే ఎఫెక్ట్ పడుతోంది. ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు తన జుట్టును కూడా త్యాగం చేసిన అమ్మా రాజశేఖర్ ఊహించని విధంగా ప్రవర్తిస్తున్నారు. కెప్టెన్ అయిన అరియానకు నిన్న చుక్కలు చూపించారు.

బాగానే కష్టపడ్డాడు.. కానీ

బాగానే కష్టపడ్డాడు.. కానీ

ఎలాంటి టాస్క్ అయినా కూడా ఓపికతో ఫినిష్ చేసే మాస్టర్ ఈ సారి మాత్రం కెప్టెన్సీ తనకే రావాలని చాలా కష్టపడ్డాడు. హోటల్ టాస్క్ నుంచి బేబీ డే కేర్ టాస్క్ వరకు చాలా కష్టపడి ఫన్ క్రియేట్ చేశారు. అయితే అక్కడక్కడా ఆయన చేసిన కొన్ని అతి తెలివి తేటలు ఇతరులను చాలా ఇబ్బంది పెట్టాయి. హారిక చెడ్డి కాంట్రవర్సీ సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ కి గురి చేసింది.

అనవసరంగా అరిచేశాడు

అనవసరంగా అరిచేశాడు


ఇక గురువారం ఆడవాళ్లకు మాత్రమే కెప్టెన్సీ అని ఆర్డర్ ఇచ్చిన బిగ్ బాస్ మగవాళ్లు సెలెక్ట్ చేయాలని టాస్క్ ఇవ్వగా అప్పటి నుంచే మాస్టర్ మనసులో ఎదో తెలియని రోధన కనిపించింది. ఇక చివరికి అరియానా కెప్టెన్ గా సెలెక్ట్ అవ్వగా ఆమె మీద కూడా కుళ్ళుతోనే అరిచేశాడు. గతంలో జరిగిన తప్పులను బయటకు తీస్తూ తన అక్కసును వెళ్లగక్కినట్లు అర్ధమయ్యింది.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
 తన గొయ్యి తానే తవ్వుకున్నాడు

తన గొయ్యి తానే తవ్వుకున్నాడు


ఇక రేషన్ మేనేజర్ పోస్టును అరియానాకు ఇవ్వగా ఆ విషయంలో కూడా అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఎన్నో సార్లు సహాయం చేసి అండగా ఉంటే ఇలా చేస్తావా? అంటూ అమ్మా మాట్లాడిన విధానం కూడా ఆయనకు మైనస్ గా మారింది. చూస్తుంటే ఈ సారి అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ విషయంలో తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X