Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హారికని కొరికేసిన అమ్మా రాజశేఖర్.. వాడికి మెంటల్ అంటూ అభిపై సెటైర్
బిగ్ బాస్ షోలో టాస్క్ లు చాలా వరకు మంచి క్రేజ్ తీసుకొస్తున్నాయి. షోలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరగాలన్నా అలాగే స్నేహం భావం కలగాలన్నా కూడా టాస్కుల కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇక ప్రతిసారి షోలో ఎక్కువగా హైలెట్ అవుతున్న వారిలో కూడా మార్పులు వస్తున్నాయి. అరియానాకు సమానంగా ఈ హారిక కూడా తన పర్ఫెమెన్స్ తో కెమెరాలను తనవైపుకు తిప్పుకుంది.
ఆ రాక్షసులు పిల్లలుగా మారి..
పిల్లలు, వారి కేర్ టేకర్స్ కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. గతవారం మంచి మనుషులు కొంటే రాక్షసుల టాస్కుతోనే చుక్కలు చూపించిన వారు ఈ సారి పిల్లలుగా మారి హౌజ్ మెంట్స్ ఓపికను పరీక్షించారు. అవినాష్, అరియానా, మెహబూబ్, హారిక, అమ్మా రాజశేఖర్ పిల్లలుగా కనిపించగా మిగతావారు వారి కేర్ టేకర్స్ గా కనిపించారు.
డైపర్స్ కూడా మార్చాలి..
అవసరం అయినప్పుడు పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా ఏడిస్తే వారిని ఎంటర్టైన్ చెయ్యాలి. అలాగే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ అవసరం అయినప్పుడు డైపర్స్ కూడా మారుస్తూ ఉండాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గురించి తెలుసుకున్న కేర్ టేకర్స్ నోయల్, సోహైల్, అఖిల్, మోనాల్, అభిజిత్ షాక్ అయ్యారు. డైపర్స్ మార్చడం ఏమిటని ప్రతీ ఒక్కరు తల పట్టుకున్నారు.
కసి తీర్చుకున్న అరియానా
టాస్క్ లో భాగంగా మరోసారి అరియానా రెచ్చిపోయింది. ఆమెకు కేర్ టేకర్ గా ఉన్న సోహైల్ ని ఒక ఆటాడుకుంది. సోహైల్ ఎలిమినేషన్ లో భాగంగా అరియానాను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. పైకి చెప్పకపోయినా కూడా అరియానా కసి తీర్చుకున్నంత పని చేసింది. గుర్రం ఎక్కుతూ, మొహం మీద పౌడర్ ఇతర వస్తువులను విసురుతూ చుక్కలు చూపించింది.
హారికను కొరికేసిన అమ్మా రాజశేఖర్
ఇక టాస్క్ లో మరోవైపు అమ్మా రాజశేఖర్, దేత్తడి హారిక చిన్న పిల్లల క్యారెక్టర్లకు తమవంతు న్యాయం చేశారు. హారిక కేర్ టేకర్ గా మోనాల్ ఉండగా అభిజిత్ అమ్మా రాజశేఖర్ ని చూసుకున్నారు. అయితే అమ్మా, హారిక చిన్న పిల్లల మాదిరిగా కొట్టుకున్నారు. అమ్మా అయితే ఏకంగా హారికపై పడి కోరికేశాడు. హారిక కూడా తన ప్రతాపం చూపించింది. ఇక చివరలో అభిజిత్ మెంటల్ అంటూ హారిక వేసిన సెటైర్ కి అమ్మా కూడా మద్దతు ఇచ్చాడు.