Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిజంగా ఎదో జరుగుతోంది.. వణుకుతున్న గొంతుతో అమ్మా రాజశేఖర్ కంటతడి
బిగ్ బాస్ హౌజ్ లో రోజుకో ట్విస్ట్ ఆడియెన్స్ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ఒకరోజు ఒకలా ఉన్న కంటెస్టెంట్స్ మరొకరోజు వెంటనే రంగులు మారుస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైందంటే చాలు తమను తాము కాపాడుకోవడానికి కంటెస్టెంట్స్ వేస్తున్న అడుగులు షాక్ ఇస్తున్నాయి. ఇక బిగ్ బాస్ హౌజ్ లో నెక్స్ట్ ఎలిమినేషన్స్ పై ఆసక్తి రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది.
అందుకే ఆమె వెళ్లిపోయింది
హౌజ్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా ఏదో ఒక విధంగా జనాలను ఆకట్టుకున్నవారే. దివి పెద్దగా ఎట్రాక్ట్ చేయకపోవడంతో గత వారం ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఆమె వెళ్లిపోవడంపై ఓ వర్గం నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ నిజానికి దివి టాస్క్ లలో పెద్దగా మెప్పించింది లేదు. హౌజ్ లో చాలా సైలెంట్ గా ఉండడం వలన ఆడియెన్స్ మద్దతు లబించలేదు.
అమ్మా రాజశేఖర్ కు డైపర్ మార్చిన అభి
ఇక మంగళవారం ఎపిసోడ్ లో హౌజ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లకు ఇంటి సభ్యులు ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు చిన్న పిల్లల్లా మారి ఇతరులను చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా అభిజిత్, అమ్మా రాజశేఖర్ కు డైపర్ వేసిన సీన్ హైలెట్ గా నిలిచింది. అరియానా మరోసారి తన పర్ఫెమెన్స్ తో రచ్చ రచ్చ చేసింది. సోహెల్ ఆమెకు కేర్ టెకర్ గా ఉండడంతో అతనికి చెమటలు పెట్టించింది.
కంటతడి పెట్టిన అమ్మా రాజశేఖర్
అయితే నిన్నటి షోలో టాస్క్ జరగనప్పుడు మాస్టర్ అమ్మా రాజశేఖర్ సోమవారం జరిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ కంటతడి పెట్టారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా లాస్య , అఖిల్ అమ్మాను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అఖిల్ మాస్టర్ తో వాగ్వివాదానికి దిగి షాక్ ఇచ్చాడనే చెప్పాలి. అది తలచుకొని అమ్మా కంటతడి పెట్టారు.
నా గుండె చాలా వీక్ అవుతోంది
హౌజ్ లో ఎదో జరుగుతోందని తన మనసు ఏమి బాగోలేదని జరుగుతున్నది చూస్తుంటే ప్రాణం పోతోందని ఏడ్చేశారు. అలాగే తన గుండె చాలా వీక్ అవుతోందని కూడా చెప్పడంతో సోహైల్, మెహబూబ్ అమ్మా రాజశేఖర్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ వారం హౌజ్ నుంచి మాస్టర్ ఎలిమినెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మా అభిమానులు మళ్ళీ కుట్రపూరితంగానే ఎలిమినేషన్స్ జరుగుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.