నువ్ నోర్ముయ్.. అభిజిత్‌తో నీకేంటి సంబంధం.. హారికపై మాస్టర్ ఫైర్
బిగ్ బాస్ హౌజ్ లో 59వ ఎపిసోడ్ లో చోటుచేసుకున్న ట్విస్టులు ఆడియెన్స్ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. కంటెస్టెంట్స్ ఊహించని విధంగా అనేక రకాల రంగులు మారుస్తున్నారు. ఎలిమినేషన్స్ స్టార్ట్ అయ్యిందంటే చాలు తమను తాము కాపాడుకోవడానికి హౌజ్ మెంట్స్ వేస్తున్న అడుగులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత వారం అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి అమ్మా రాజశేఖర్ వెళ్లిపోయినట్లే అని అనుకున్న సమయానికి నాగార్జున చివరినిమిషంలో ట్విస్ట్ ఇచ్చి సేవ్ చేశారు. ఇక ఇప్పుడు అంతకు మించిన ట్విస్టులతో షాక్ ఇస్తున్నారు.

మాస్టర్ తగ్గడం లేదుగా..
ఇప్పుడు హౌజ్ లో ఉన్న వారు అందరు కూడా ఏదో ఒక విధంగా జనాలను ఆకట్టుకున్నవారే. ప్రతి ఒక్కరికి ఆడియెన్స్ సపోర్ట్ ఎంతో కొంత ఉంది. అయితే అయితే అమ్మా రాజశేఖర్ ధైర్యం ఏమోటో గాని నానా రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏ మాత్రం తగ్గకుండా హౌజ్ లో నా కంటే తోపు ఎవరు లేరు అనే విధంగా గొడవలకు దిగారు. మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా చుక్కలు చూపించారు. ఓ వర్గం నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ అమ్మా తన డోస్ ని మాత్రం తగ్గించడం లేదు.

అమ్మా రాజశేఖర్ vs అభిజిత్
ఎలిమినేషన్స్ సంగతి పక్కనపెడితే కంటెస్టెంట్స్ గొడవలతో ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అమ్మా రాజశేఖర్.. అభిజిత్ మధ్యలో జరిగిన గొడవ నిజంగా నెవర్ బోఫోర్ అనేలా ఉంది. నోయల్ టార్గెట్ చేసినప్పటి విషయాన్ని కూడా మధ్యలోకి లాగి మాస్టర్ చాలా సీరియస్ అయ్యారు. ఆ గొడవతో మిగతా హౌజ్ మెంట్స్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

నువ్ నోర్ముయ్ నికేంటి సంబంధం
ఇక అభిజిత్ పై మాస్టర్ కోపం అంతకంతకు ఎక్కువయ్యింది. మధ్యలోకి అవినాష్ కూడా రావడంతో సీన్ మరోలా మారింది. గొడవ ఎక్కువవ్వడంతో హారిక కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అవినాష్ నువ్ ఎందుకు మధ్యలోకి వచ్చావ్ అని అడగడంతో మాస్టర్ హారికపై కోప్పడ్డారు. నువ్ నోర్ముయ్ నికేంటి సంబంధం అని షాక్ ఇచ్చారు.

మాస్టర్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడా?
హారిక చాలా సందర్భాల్లో అభిజిత్ పై ఎవరైనా కోప్పడితే మధ్యలోకి దూరడం అందరికి తెలిసిందే. అయితే ఈ సారి అమ్మా రాజశేఖర్ మాత్రం ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ కోపం కాస్త ఎక్కువయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి. అమ్మా తన హద్దుల్ని దాటేసి మాట్లాడుతున్నట్లు అర్ధమవుతోంది. గతంలో హారిక, మాస్టర్ కి మద్దతు ఇచ్చినప్పటికి అవేవి గుర్తు లేకుండా సీరియస్ అయ్యారు. దీంతో రానున్న ఎలిమినేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నట్లు అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











