బిగ్ బాస్ 4: గంగవ్వ స్థానంలో మరొక స్టార్ సెలబ్రెటీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రి
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. గడిచిన మూడ్ సీజన్స్ కంటే కూడా నిర్వాహకులు ఈ సారి చేసిన ప్రయోగం గట్టిగానే వర్కౌట్ అవుతోంది. కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు ఆలోచించిన విధానంపై సెటైర్స్ చాలానే వచ్చాయి. ఒక్క స్టార్ సెలబ్రటీ కూడా లేడని నెగిటివ్ కామెంట్స్ రాబడంతో మొదటి రెండు వారాలు రేటింగ్స్ పై ప్రభావం చూపినట్లు అర్ధమయ్యింది. ఇక మెల్లగా నాగార్జున తన హోస్టింగ్ తో షోపై హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. ఇక బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కూడా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

షోపై నెగిటివ్ కామెంట్స్.. అనుమానాలు
వంద రోజులకు పైగా షోను నిర్వహించాలి కాబట్టి కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ లో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే టాక్ వచ్చింది. గత మూడు సీజన్స్ లలో బయటకు వచ్చిన వారిలో ఎక్కువమంది షోపై నెగిటివ్ కామెంట్స్ అయితే చేయలేదు. కానీ ఈ సారి ఎలిమినేషన్స్ లో పలు అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే కరాటే కళ్యాణి, టీవీ9 దేవి నాగవల్లి, అలాగే స్వాతి దీక్షిత్ కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

వచ్చేవారం వరకు డోకా లేదని..
ఇక శనివారం ఎపిసోడ్ లో హౌజ్ నుంచి గంగవ్వ సొంత నిర్ణయంతోనే తప్పుకుంది. అయితే ఈ రోజు మరొక కంటెస్టెంట్ ఎలిమినెట్ అవ్వక తప్పదు. ఆ కంటెస్టెంట్ సుజాత అని తెలుస్తోంది. సోహెల్ కి అయితే వచ్చేవారం వరకు డోకా లేదని నాగార్జున చాలా క్లియర్ గా చెప్పేశాడు. ఇక మిగిలిన వారిలో సుజాత అత్యదిక ఓట్లతో తో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

గంగవ్వ స్థానంలో మరొకరిని..
నిన్నటివరకు బిగ్ బాస్ షోలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ అయితే గట్టిగానే వచ్చింది. కానీ అవన్నీ అబద్దాలని తెలుస్తోంది. ఇక గంగవ్వ వెళ్లిపోతే ఆమె స్థానంలో మరొకరిని తీసుకువచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్ హౌజ్ లోకి రాగా వచ్చిన మొదటి వారానికె స్వాతి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

నాలుగవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
ఇక గంగవ్వ సొంత నిర్ణయంతో బయటకు వెళ్లిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే వారానికి కంటెస్టెంట్స్ ని ఎలిమినెట్ చేయాలి. ఇంటి సభ్యులను కూడా ఎక్కువగా తక్కువగా కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అందుకే గంగవ్వ స్థానంలో మరోక స్టార్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చే అవకాశం ఉందని టాక్. ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే ఈ రోజూ ఎపిసోడ్ పై ఒక లుక్కేయాల్సిందే.
Recommended Video

వచ్చే వారం హోస్ట్ గక్ మరో హీరో
ఇక నాగార్జున హోస్ట్ స్థానంలో మరొక స్టార్ హీరో రాబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగ్ థాయిల్యాండ్ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఇక వచ్చే వారం ఆయన అందుబాటులో ఉండే అవకామైతే లేదని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


Click it and Unblock the Notifications











