టార్చర్ అంటే ఏంటో చూపిస్తా.. కింద మిరపకాయలే.. అరియానా హాట్ కామెంట్స్
బిగ్ బాస్ 7వారం చేరుకునే సరికి అసలైన గేమ్ మొదలైనట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లను చూస్తుంటే రోజురోజుకు కంటెస్టెంట్స్ మధ్య ఆవేశాలు అగ్రహాలు కట్టలు తెచ్చుకుంటున్నాయని అనిపిస్తోంది. సహనాన్ని పరిక్షిస్తూనే మరోవైపు కోపాన్ని తెప్పిస్తున్న టాస్క్ లతో ఈ వారం చాలా సరదాగా గడుస్తోంది. మంచి మనుషులు కొంటె రాక్షసులు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బాగానే క్లిక్కయ్యింది.

అమ్మా, అరియానా కామెడీ కాంబో
మొదటి నుంచి కూడా బిగ్ బాస్ లో కొన్ని కాంబినేషన్స్ మధ్య చోటు చేసుకుంటున్న సీన్స్ చాలా సరదాగా అనిపిస్తున్నాయి. ఇక అమ్మా రాజశేఖర్, అరియానా మధ్య ఒకవైపు సీరియస్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూనే మరోవైపు కామెడీ షేడ్స్ లో దర్శనమిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ బిగ్ బాస్ లో ఈ మధ్య మంచి ఎంటర్టైన్మెంట్ గా మారింది.

మోనాల్ తో సరసాలు అడుతూనే
హోటల్ టాస్క్ దగ్గరి నుంచి అరియానా, అవినాష్ మధ్య కామెడీ ఎక్కువగా కొనసాగుతోంది. అయితే వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే విషయంలో కంటెస్టెంట్స్ కూడా పలు అనుమానాలను లేవనెత్తారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా అవినాష్ ఒకవైపు మోనాల్ తో సరసాలు అడుతూనే మరోవైపు అరియానా అంటూ ప్రేమగా పిలుస్తున్నారు.

కింద మిరపకాయలు పెట్టాలని ఉందని
అయితే కొంటె రాక్షసులు, మంచి మనుషులు టాస్క్ లో మాత్రం అరియానా, అమ్మా రాజశేఖర్ పార్ట్ బాగా వైరల్ అయ్యింది. రక్షసులుగా ఉన్న అరియానా మానవుడైనా అమ్మను చాలానే ఇబ్బంది పెట్టింది. ఐస్ ముక్కలు షర్ట్ లో పెట్టి టార్చర్ చేసింది. ఇక నిన్న అయితే ఇంకా కసిగా కామెంట్ చేసింది. కింద మిరపకాయలు పెట్టాలని ఉందని సెటైర్ వేసింది. దెబ్బకు అమ్మా భయపడిపోయాడు.

నీళ్లలోకి నెట్టేసిన అమ్మా రాజశేఖర్
కుండలతో డ్రమ్ములల్లో నీళ్లు నింపాలని అన్నప్పుడు అరియానా, అమ్మా మధ్యన కూడా చాలా కామెడీ జరిగింది. అరియానా స్వమ్మింగ్ పూల్ పక్కనే ఉండగా వెనక నుంచి అరియానకు నీళ్లలోకి నెట్టిన అమ్మా గుంపులో గోవిందా అన్నట్లుగా సైడ్ అయిపోయాడు. అరియానా నోయల్ తోసేశాడు అనుకోని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెహబూబ్, అఖిల్ గొడవ సీరియస్ అవుతున్న సమయంలో కూడా అమ్మా అరియానాతోనే డిస్కషన్ పెట్టడం హాట్ టాపిక్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











