అరియనా, అవినాష్ మధ్య మరో ఎమోషనల్ సీన్.. వామ్మో ఇది తట్టుకోలేకపోతున్నాం!
బిగ్ బాస్ టాస్క్ ఇచ్చడంటే చాలు పెర్ఫామెన్స్ విషయంలో ఎవరు తగ్గడం లేదు. వీలైనంత వరకు ఎవరి స్టైల్ లో వారు రెచ్చిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు, వారి కేర్ టేకర్స్ కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. గతవారం మంచి మనుషులు కొంటే రాక్షసుల టాస్కుతోనే చుక్కలు చూపించిన వారు ఈ సారి పిల్లలుగా మారి హౌజ్ మెంట్స్ ఓపికను పరీక్షించారు.

అంతకు మించి..ఓవరాక్షన్
ఇక ప్రతిసారీ కూడా అరియానా, అవినాష్ కి సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాయి. అరియానా ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఓవరాక్షన్ అనే దానికంటే అంతకు మించి అనేలా షాక్ ఇస్తోంది. ఇక ఆమె ఎలాంటి పని చేసినా కూడా అవినాష్ నుంచి ఉహించని సపోర్ట్ లభిస్తోంది. బుధవారం రోజు కూడా వీరి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఆడియెన్స్ కి కాస్త చిరాకు తెప్పించింది.

కెమెరా ముందు చిన్న పిల్లలా..
బిగ్ బాస్ డే కేర్ టాస్క్ లో భాగంగా చివరికి లాస్య సపోర్ట్ తో సోహైల్, అరియానా విన్నర్ గా నిలిచారు. అయితే గెలిచిన సంతోషంలో అరియానా కెమెరా ముందుకు వచ్చి తన రేంజ్ పర్ఫెమెన్స్ తో కాస్త ఓవర్ చేసినట్లు అనిపించింది. బిగ్ బాస్ ఇచ్చిన బొమ్మ నా దగ్గరే ఉండాలి. నేను దీన్ని మా ఇంటికి తీసుకు వెళతాను అంటూ చిన్న పిల్లలా ప్రవర్తించింది.

బొమ్మ కోసం ఏడ్చేసిన అరియానా
ఆ తరువాత ఏడ్చుకుంటు అవినాష్ దగ్గరకు వచ్చింది. ఈ బొమ్మను మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలని లేదు. నాకు ఇది కావాలని అవినాష్ కి ఏడుస్తూ చెప్పింది. ఇక అతను కూడా ఆమెను ఓదారుస్తూ హీరో లెవెల్లో పెర్ఫామెన్స్ ఇచ్చాడు. తప్పకుండా నేను మాట్లాడి నీకు వచ్చేలా చేస్తానని ప్రామిస్ కూడా చేసేశాడు.

చూసినా పట్టించుకోలేదు..
వీరి పెర్ఫామెన్స్ ని పక్క నుంచి వెళుతూ చూసిన హారిక పెద్దగా పట్టించుకోలేదు. ఆమె మొహంలో వీళ్ళు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారని చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. అఖిల్ కూడా వారి పక్కనుంచే వెళుతూ ఏమయ్యిందని కూడా అనలేదు. చివరికి హగ్ చేసుకొని అవినాష్ ఆమెను ఓదార్చారు. ఆ సీన్ అయితే సోషల్ మీడియాలో నెవర్ బిఫోర్ అనేలా ట్రోల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











