Bigg boss4: మగ దిక్కు లేని జీవితం.. రూ.500కు కూడా ఆ పనులు చేశాను: అరియానా గ్లోరి

బిగ్ బాస్ సీజన్ 4 ఎలా ముగుస్తుందో తెలియదు గాని చివరివరకు నిలిచే కంటెస్టెంట్స్ ఎవరు అనేది రోజురోజుకు మరింత సస్పెన్స్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ ఎక్కువగా ఎమోషనల్ స్టోరీలతో జనాలను ఆకర్షిస్తున్నారు. ఇక గురువారం ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరు వారి పూర్వ అనుభవాలను గుర్తు చెలుకుంటూ ఎమోషనల్ అయ్యారు. లాస్య, హారిక, అరియానా వారి బాధలను చెప్పుకొని కంటతడి పెట్టారు.

నా అసలు పేరు ఇదే..

నా అసలు పేరు ఇదే..

ముఖ్యంగా అరియానా గ్లోరి చెప్పిన విధానం హౌజ్ లో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అమ్మా నాన్న విడిపోయినప్పుడు తనకు ఏమి తెలియని వయసులో ఉన్నానని చెబుతూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. అలాగే తన అసలు పేరు అర్చన అనే విషయాన్ని కూడా ఈ బ్యూటీ బయటపెట్టింది.

ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను.

ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను.

అరియానా మాట్లాడుతూ.. నా జీవితం గురించి ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను. మా అమ్మ గవర్నమెంట్ నర్స. మా పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్. కానీ కొన్నాళ్లకు విడిపోయారు. అప్పుడు నా వయసు నాలుగేళ్లు. మా చెల్లి అమ్మ కడుపులో ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చాలా ధైర్యంగా ఉంటూ మమ్మల్ని ఎలాంటి కష్టం లేకుండా పెంచింది. మంచి విద్యను అందించింది. నేను మా చెల్లి రెండు కళ్ళు అంటూ ప్రేమగా చూసుకుంటుంది.

మగ దిక్కు లేని జీవితంలో..

మగ దిక్కు లేని జీవితంలో..

మగ దిక్కు లేని జీవితంలో కొన్ని ఇబ్బందులు చూడాల్సి వచ్చింది. ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే కూడా కుటుంబ సభ్యులు వచ్చేవారు కాదు. అన్ని మా అమ్మే దగ్గరుండి చేసేది. మొదట్లో నేను యాంకరింగ్ చేస్తాను అంటే అసలు ఒప్పుకోలేదు. కానీ డిగ్రీ లేదని హైదరాబాద్ లో ఎదో ఒక జాబ్ చేయాలని డిసైస్ అయ్యాను. ఒక దగ్గర 4వేల రూపయలకు జాబ్ చేశాను. కానీ అక్కడ చాలా రాజకీయాలు ఉండేవి.

Recommended Video

Bigg Boss Telugu 4 : ప్లాన్ ప్రకారమే Gangavva ను హౌస్ నుంచి పంపేసిన Bigg Boss !
500రూపాయలకు కూడా ఆ విధంగా..

500రూపాయలకు కూడా ఆ విధంగా..

సరిగ్గా తిండి దొరకని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను నా ఫస్ట్ లవ్ ని కూడా మిస్సయ్యాను. ఇక యాంకరింగ్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 500రూపాయలకు అలాగే 800లకు కూడా ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడి వరకు వచ్చాను. యాంకరింగ్ గా కెరీర్ ని కొంచెం సీరియస్ గా తీసుకున్న తరువాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. గర్వంగా ఉంది. అర్చన నుంచి అరియానాగా మారి బిగ్ బాస్ ద్వారా ఇలా ఉన్నాను.. అంటూ అరియానా చాలా క్లారిటీగా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X