లాస్య పప్పు గోల.. ఫన్ టైమ్‌లో అవినాష్ డామినేషన్
బిగ్ బాస్ లో ఆదివారం రోజు అవినాష్ తో కామెడీతో మరోసారి డామినేట్ చేశారు. అందరిని సరదాగా ఇమిటేట్ చేస్తూ అత్యదిక మార్కులు పొందాడు. నాగార్జున ఒక్కొక్కరి సీక్రెట్స్ ని కంటెస్టెంట్స్ చేత బయటకు తెప్పిస్తూ చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మెయిన్ గా అవినాష్, అమ్మా రాజశేఖర్ ఇమిటేట్ చేసిన విధానం అందరికి నవ్వులు తెప్పించింది. ఇక ప్రతి ఒక్కరి ఇమిటేషన్ లో అవినాష్ తనధైన శైలిలో పంచ్ లు వేసే ప్రయత్నం చేశాడు.
మెయిమ్ గా లాస్య పప్పు గోల ఎలా ఉంటుందో అవినాష్ చాలా కామెడీగా చూపించాడు. ఆమె పప్పువల్ల అందరికి మోషన్స్ అవుతున్నాయనే సీన్ ని చాలా బాగా ఇమిటేట్ చేశాడు. ఇక అమ్మా రాజశేఖర్, అరియానా కెప్టెన్ అయినప్పుడు ఎలా ఉంటాడు అనే సిచ్యువేషన్ ని కూడా ఫుల్ గా అనుకరించిన విధాన నవ్వులు పూయించింది. ఇక అమ్మా రాజశేఖర్ మాత్రం మెహబూబ్ కోపాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఇక లాస్య, మోనాల్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యింది. అయితే ఫన్ టైమ్ లో అందరికంటే ఎక్కువగా అవినాష్ డామినేట్ చేశాడని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా అందరిని కూడా ఒకేసారి అనుకరించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక హౌజ్ లో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా అవినాష్ లేకపోతే మాత్రం ఫన్ ఉండదని అనేలా తన టాలెంట్ ని చూపిస్తున్నాడు. అలాగే అమ్మా రాజశేఖర్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. వీళ్ళిద్దరు ఇప్పట్లో హౌజ్ నుంచి వెళ్లిపోయేలా లేరని సోషల్ మీడియాలో రూమర్లు అయితే గట్టిగానే వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











