నాగ్ ముందే మోనాల్, అవినాష్ ముద్దులాట.. మధ్యలో అఖిల్ కూడా..
బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఉండే రిలేషన్స్ ఎప్పటికప్పుడు ఊహించని మలుపులు తిరుగుతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఎవరు ఎలాంటి రంగులు మారుస్తారో తెలియదు. ఇక నిన్నటితో నాగార్జున ఆడిన ఏలిమినేషన్ డ్రామాలో అమ్మా రాజశేఖర్ శత్రువుల అసలు రూపం కూడా బయటపడింది. అయితే అంతకుముందు నాగార్జున హౌజ్ మెంట్స్ మధ్య క్రియేట్ చేసిన ఫన్ మంచి ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది.

ఫన్ క్రియేట్ చేస్తూనే..
ముఖ్యంగా అవినాష్ సరసాలు మరోసారి బయటపెట్టారు నాగార్జున. హౌజ్ లో పాటలతో గేమ్స్ తో కంటెస్టెంట్స్ మధ్య ఫన్ క్రియేట్ చేస్తూనే వారి అసలు రంగులను కూడా బయటకు తీశారు. ముఖ్యంగా అవినాష్ మోనాల్ తో చేసే రొమాన్స్ పై నాగార్జున చాలా పంచ్ లు వేశారు. అఖిల్, అరియానా కూడా అవినాష్ ని ఇమిటేట్ చేసి చూపించిన విధానం అందరికి నవ్వు తెప్పించింది.

ముద్దులు పెట్టిన మోనాల్
ప్రతిసారి అవినాష్ మోనాల్ వద్దకు వెళ్లి ముద్దులు అడగడం గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా కొంటె రాక్షసులు మంచి మనుషుల టాస్క్ లో ఉన్నప్పుడు మోనాల్ అవినాష్ కి చాలా సార్లు ముద్దులు పెట్టింది. వారి రొమాన్స్ చూసి లాస్య కూడా సెటైర్లు వేసింది. ఇక నాగార్జున ఆ విషయాన్ని బాగానే గుర్తు చేసుకోని ఎలా చేస్తావో మరోసారి చేసి చూపించాలని అవినాష్ ని కోరారు.

మోనాల్ స్థానంలో మెహబూబ్
మోనాల్ ని మెహబూబ్ అనుకొమ్మని చెప్పగా అవినాష్ షాక్ అయ్యాడు. అప్పుడు ఇమిటేట్ చేయడం రాలేదు. ఇక ఫైనల్ గా మోనాల్ ముద్దు పెడితేనే ఆ ఫీలింగ్ వస్తుందని చెప్పడంతో నాగ్ ఆమెను రంగంలోకి దింపాడు. ఇక మోనాల్ కూడా అందుకు ఒప్పుకొని అవినాష్ కి ముద్దులు పెట్టింది. ఇంకో లడ్డు కావాలా నాయనా అంటూ మరో ముద్దు కూడా అడిగాడు అవినాష్. దీంతో నాగ్ పగలబడి నవ్వారు.
Recommended Video

ఈ ఎపిసోడ్ తో నా పని అవుట్
ఇక పెళ్లిపై కూడా సెటైర్లు వేయడంతో దెబ్బకు అవినాష్ దండం పెట్టేశాడు. ఈ ఎపిసోడ్ తో నా పని అవుట్ అంటూ సరదాగా కామెంట్ కూడా చేశాడు. అఖిల్ కి అవినాష్ గురించి బాగా తెలుసని చెప్పడంతో అతన్ని కూడా ఇమిటేట్ చేయమని చెప్పారు నాగ్. అఖిల్ కరెక్ట్ గా చేయడంతో అతనికి 10/10 మర్క్స్ అంటూ అవినాష్ పాజిటివ్ గా స్పందించారు. కేవలం ఎలిమినేషన్స్ తో సీరియస్ గానే కాకుండా నాగార్జున ఫన్ క్రియేట్ చేయడంలో చాలా తెలివిగా ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











