గేమ్ ఆడమంటే వెన్నుపోటు పొడుస్తావా.. హారికకు అవినాష్ హెచ్చరిక
బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి సగానికి చేరుకుంది. ఇక నుంచి అసలైన గేమ్ మొదలవుతుందని హౌజ్ లో వాతావరణాన్ని చూస్తేనే చాలా క్లియర్ గా అర్ధమవుతుంది. స్నేహితులు కూడా శత్రువులుగా మారుతున్నారు. ఇక హారికపై అప్పుడప్పుడు పాజిటివ్ గా ఉండే అవినాష్ కూడా ఆమెకి శత్రువు అయ్యాడు. ఒక విధంగా నామినేషన్ లో ఆమె వెన్నుపోటు పొడిచేలా ఉందని హైలెట్ చేసినట్లు అనిపించింది.
గుడ్డు తలపై కొట్టి నామినేషన్ చేయాలని చెప్పడంతో అందరూ వారి విలన్స్ పై రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఇక హారికపై గుడ్డు పగలగొట్టి ఆమెను నామినేట్ చేసిన అవినాష్ హెచ్చరించాడు కూడా. టాస్క్ ఇచ్చినప్పుడు గేమ్ ని గేమ్ లా ఆడాలి. అలా కాకుండా.. నువ్ ఉన్న టీంలో కాకుండా నీకు ఇష్టమైన వాళ్లకు ఫేవర్‌గా గేమ్ ఆడటం సరైనది కాదు. నాకు ఆ విషయంలో నువ్వు నచ్చలేదు. గేమ్‌ని గేమ్‌లా ఆడనందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పాడు అవినాష్. దీంతో ఒక్కసారిగా వారి మధ్య కూడా శత్రుత్వం పేరిగినట్లు అర్ధమయ్యింది.

హారిక మొదటి నుంచి కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత వరకు శత్రువులను పెంచుకోకుండా చాలా సైలెంట్ గా హైలెట్ అవుతోంది. సమయం వచ్చినప్పుడు టాలెంట్ ని బయటపెడుతోంది.
కానీ ఆమె అభిజిత్, లాస్య, నోయల్ సోహైల్ వంటి వారితో ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయడం చాలా మందికి నచ్చలేదు. ఎప్పుడైనా గేమ్ లో గ్రూపులుగా విడిపోయినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేది. అది అవినాష్ కి చాలా బాగా అర్ధమయ్యింది. అందుకే ఆమెను నామినేట్ చేశాడు. మరి హారిక కూడా రివెంజ్ తీర్చుకుంటుందో లేదో నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











