చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు.. బిగ్ బాస్‌కి అవినాష్ వార్నింగ్
బిగ్ బాస్ లో మరోసారి మాటల తూటాలు నాన్ స్టాప్ గా పేలాయి. కంటెస్టెంట్స్ కోపం రోజురోజుకు హద్దులు దాటుతోందనే చెప్పాలి. గతంలో కొంత లిమిట్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు సహనం కోల్పోతున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో ఏకంగా బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి చోటు చేసుకుంది. ఒక్కసారిగా అవినాష్ తన సహనాన్ని కోల్పోయాడనే చెప్పాలి. ఇక సోహైల్ కూడా మరోసారి తన కోపాన్ని చూపించాలనే ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ కాలేదు.

అవినాష్ కూడా త ఆ సహనాన్ని కోల్పోయి..
బిగ్ బాస్ సిజన్ 4లో రోజురోజుకు సరికొత్త టాస్క్ లతో ఊహించని వాతావరణం క్రియేట్ అవుతోంది. బిగ్ బాస్ వేస్తున్న ప్లాన్స్ చాలా వరకు వర్కౌట్ అవుతున్నాయని అనిపోస్తోంది. ఇక గతంలో ఇచ్చిన టాస్క్ లతో పోలిస్తే ఇప్పుడు పిజికల్ టాస్క్ ల డోస్ గట్టిగానే పెరిగిందని చెప్పవచ్చు. అవినాష్ కూడా త ఆ సహనాన్ని కోల్పోయి ఒకవైపు సోహైల్ కి వార్నింగ్ ఇస్తూనే బిగ్ బాస్ పై కూడా అసహనం వ్యక్తం చేశాడు.

చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు.
టాస్క్ లలో అనవసరంగా సింపథి పొంది డైలాగ్ లతో మమ్మల్ని చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు. అందరూ బిగ్ బాస్ చెప్పినట్టుగానే ఆడుతున్నారు. నార్మల్ గా ఒక టాస్క్ ని టాస్క్ లనే ఫినిష్ చేయండి అంటూ సోహైల్ పై ఫైర్ అయ్యాడు అవినాష్. అంతే కాకుండా సంచాలకుడిగా అతడు వేస్ట్ అంటూ కోపానికి గురయ్యేలా కూడా చేశాడు.

ఎలిమినెట్ చేయాలంటే చేసేయ్యండి బిగ్ బాస్
అవినాష్ బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తూ.. ఎలిమినెట్ చేయాలంటే చేసేయ్యండి బిగ్ బాస్. క్లారిటీ లేకపోతే బావుండదు. సంచాలకుడిగా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా అంటే.. అప్పుడు మేము ఆడటం దేనికి? ఎందుకు ఇదంతా.. డైరెక్ట్ గా విన్నింగ్ ఇచ్చేయండి. గేమ్ ఆడుతున్న మేము ఎందుకు పిచ్చోళ్ళం అవ్వాలి. మనిషిలో అన్ని రకాల ఆవేశాలు ఉంటాయి. ఎవరైనా సరే సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు.. అంటూ సోహైల్ సహనాన్ని పరీక్షించాడు అవినాష్.
Recommended Video

సోహైల్ కంటతడి..
అవినాష్ ఇచ్చిన డోస్ కి సోహైల్ చివరికి ఏమి మాట్లాడలేక కోపాన్ని అనగదొక్కుకొని సైలెంట్ గా అలానే ఉండిపోయాడు. అనంతరం బాత్ రూమ్ లోపలికి వెళ్ళి తన కోపాన్ని చూపించాడు. వెంటనే అఖిల్, మెహబూబ్ వెళ్లి అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక నేను అరవను కొప్పడను.. నాగార్జున సర్ కి ప్రామిస్ చేశానని సోహైల్ కంటతడి పెట్టుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.


Click it and Unblock the Notifications











