అమ్మా రాజశేఖర్ సేవ్ కావడానికి అసలు కారణాలివే.. నెవర్ బిఫోర్ ట్విస్ట్
బిగ్ బాస్ హౌజ్ లో ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. కంటెస్టెంట్స్ వెంట వెంటనే అనేక రకాల రంగులు మారుస్తున్నారు. ఎలిమినేషన్స్ స్టార్ట్ అయ్యిందంటే చాలు తమను తాము కాపాడుకోవడానికి కంటెస్టెంట్స్ వేస్తున్న అడుగులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక ఆదివారం బిగ్ బాస్ హౌజ్ నుంచి అమ్మా రాజశేఖర్ వెళ్లిపోయినట్లే అని అనుకున్న సమయానికి నాగార్జున చివరినిమిషంలో ట్విస్ట్ ఇచ్చి సేవ్ చేశారు.

నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ
ఇప్పుడు హౌజ్ లో కంటెస్టెంట్స్ అందరు కూడా ఏదో ఒక విధంగా జనాలను ఆకట్టుకున్నవారే. ప్రతి ఒక్కరికి ఆడియెన్స్ సపోర్ట్ ఎంతో కొంత ఉంది. అయితే గత వారం దివి పెద్దగా ఎట్రాక్ట్ చేయకపోవడంతో ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఆమె వెళ్లిపోవడంపై ఓ వర్గం నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ నిజానికి దివి ఏ టాస్క్ లోను పెద్దగా మెప్పించింది లేదు. హౌజ్ లో చాలా సైలెంట్ గా ఉండడం వలన ఆడియెన్స్ మద్దతు లబించలేదు.

చివరగా.. మెహబూబ్, అమ్మా రాజశేఖర్
ఇక ఆదివారం ఎపిసోడ్ లో హౌజ్ లో జరిగిన డ్రామాలో నాగ్ ఇచ్చిన ట్విస్ట్ ఎవరు ఉహీంచలేదు. ఇలాంటి పరిణామాలు చాలా రేర్ అనే విధంగా నాగార్జున అమ్మా రాజశేఖర్ ని సేవ్ చేశారు. ఈ వారం ఎలిమినేషన్స్ డేంజర్ జోన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరగా మెహబూబ్, మాస్టర్ లను చావో రేవో తేల్చుకునేలా చేశారు.

అదే మాస్టర్ కు ప్లస్ అయ్యింది
ఇంటి సభ్యుల మద్దతు కూడా మెహబూబ్ కి లభించడంతో అమ్మా ఎలిమినెట్ కాయమని అంతా అనుకున్నారు. అరియానా, అవినాష్ తప్పితే ఎవరు కూడా మాస్టర్ కి మద్దతు ఇవ్వలేదు. ఒక విధంగా ఆయనపై ఎక్కువ మంది టార్గెట్ చేయడమే పాజిటివ్ గా మారింది. పైగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున కూడా ప్రకటించడంతో అమ్మా సేవ్ అయ్యారు.

నోయల్ స్పెషల్ రిక్వెస్ట్
అనారోగ్య కారణాల వల్ల నోయల్ బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కూడా ఈ వారం ఎలిమినెట్ చేయవద్దని నాగార్జునను కోరాడు. అది కూడా అమ్మాకు ప్లస్ అయ్యింది. అమ్మా రాజశేఖర్ పొరపాట్లు కూడా జనాల్లో పెద్దగా నెగిటివ్ ఫీలింగ్ నికలుగజేయలేదని ఓట్లు కూడా బాగానే పడ్డాయని తెలుస్తోంది. ఏదేమైనా గతంలో కుమార్ సాయికి జరిగిన విధంగా ఈ సారి అమ్మా విషయంలో జరగలేదనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











