మన ఫ్యామిలీ సేఫ్.. బిగ్ బాస్‌లో ముగ్గురు మొనగాళ్లు
బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరు చెప్పలేరు. ముఖ్యంగా ఎలిమినేషన్స్ మొదలైతే మిత్రువులు కూడా శత్రువులు అవుతారు. వీలైనంత వరకు తమను తాము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అఖిల్, మోనాల్ ని నామినేట్ చేయడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక మరొక ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే ఫ్రెండ్లిగా ఉండే మాస్టర్, హారిక కూడా శత్రువులు అయ్యారు.
అలాగే అమ్మా రాజశేఖర్, అభిజిత్ గొడవ జరుగుతున్నప్పుడు.. అఖిల్, అభికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం మరొక బిగ్ షాక్. ఇదంతా ఒక ఎత్తైతే.. ఎలిమినేషన్స్ లో మెహబూబ్, అఖిల్, సోహైల్ లేకపోవడం బిగ్ సర్ ప్రైజ్. బిగ్ బాస్ ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ని ఎనౌన్స్ చేస్తున్నప్పుడు.. వాళ్ళు ముగ్గురు కూడా హగ్ చేసుకున్నారు. మన ఫ్యామిలీ సేఫ్ అంటూ మెహబూబ్ కొట్టిన డైలాగ్ తోనే ఆ విషయం అర్ధమయ్యింది.

మెహబూబ్ సోహైల్ ముందు నుంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. అయితే వారితో అఖిల్ కలవడం షాకింగ్ విషయం. ఎందుకంటే చాలాసార్లు టాస్క్ లలో అఖిల్, మెహబూబ్ మధ్య గొడవలు అయ్యాయి. రెచ్చగొట్టేలా మాట్లాడుకున్నారు. సోహైల్, అఖిల్ మధ్యలో కూడా దూరం పేరిగినట్లు అనిపించింది గాని మంగళవారం ఎపిసోడ్ లో మళ్ళీ వారంతా ఒకటయినట్లు అర్ధమయ్యింది. దీంతో నెటిజన్లు కూడా ముగ్గురు మొనగాల్లు మళ్ళీ ఒకటయినట్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











