ఆమె ఖతర్నాక్ కిలాడీ.. వాళ్లిద్దరిని ముంచేస్తుంది: కంటెస్టెంట్‌పై సూర్య కిరణ్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Manoj Kumar P

బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోగా... కొందరు మాత్రం చెడ్డ పేరును తెచ్చుకున్నారు. వీళ్లలో చాలా మంది బిగ్ బాస్ యూనిట్‌పై విమర్శలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరారు దర్శకుడు సూర్య కిరణ్. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఆయన... మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత షో నిర్వహకులపై, కంటెస్టెంట్లపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నాడు. తాజాగా హౌస్‌లోని ఓ కంటెస్టెంట్‌ క్యారెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడాయన. ఆ వివరాలు మీకోసం.!

రాజులా ఉంటానని ఎంట్రీ ఇచ్చాడు

రాజులా ఉంటానని ఎంట్రీ ఇచ్చాడు

తనలో రెండు యాంగిల్స్ ఉన్నాయని, అందులో మంచి దానిని ఉపయోగించి బిగ్ బాస్ హౌస్‌లో నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ప్రారంభ ఎపిసోడ్‌లో చెప్పాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్య కిరణ్. అంతేకాదు, తనలానే ఉండి... అందరి ప్రేమను అందుకుని చదరంగంలో రాజులా గెలుపొంది బిగ్ బాస్ టైటిల్‌ను చేజిక్కించుకుంటానని వెల్లడించాడు. దీంతో ఆయనపై అంచనాలు ఏర్పడ్డాయి.

మాట తీరే అతడిని దెబ్బ కొట్టింది

మాట తీరే అతడిని దెబ్బ కొట్టింది

ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరొందిన సూర్య కిరణ్.. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తన బాణీ వినిపించడానికి ట్రై చేశాడు. గొడవలు సర్ధుమణిగేలా చేయాలని ఆయన చొరవ చూపడంతో పాటు తన మాటే వినాలన్న రీతిలో వ్యవహరించాడు. అదే అతడికి దెబ్బకొట్టింది. ఫలితంగా బిగ్ బాస్ సీజన్ -4 నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్‌గా ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.

బయట కూడా దర్శకుడి హల్‌చల్

బయట కూడా దర్శకుడి హల్‌చల్

బిగ్ బాస్‌ హౌస్‌లో హడావిడి చేసి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్... బయటకు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే పలు న్యూస్ ఛానెళ్లతో పాటు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత, బిగ్ బాస్ షోకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

జాతకాలు చెప్పింది చూపించలేదు

జాతకాలు చెప్పింది చూపించలేదు

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య కిరణ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘బిగ్ బాస్ హౌస్‌లో జరిగినవన్నీ చానెల్ వాళ్లు ప్రసారం చేయడం లేదు. మరీ ముఖ్యంగా నేను ఎలిమినేట్ అయ్యే ముందు రోజు అందరికీ జాతకాలు చెప్పాను. దానికి అందరూ సంతోషపడ్డారు. కానీ, అది చానెల్‌లో ప్రసారం అవలేదు' అని ఆయన చెప్పుకొచ్చారు.

సూర్య కిరణ్ వివాదాస్పద వ్యాఖ్యలు

సూర్య కిరణ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇదే ఇంటర్వ్యూలో బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరి గురించి తనదైన శైలిలో కామెంట్లు చేశాడు సూర్య కిరణ్. గంగవ్వపై అందరూ ప్రేమ నటిస్తున్నారని, దేవీ నాగవల్లితో లవ్ ట్రాక్ నడుపుదామనుకున్నానని ఇలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో ఎవరు బెస్ట్ కంటెస్టెంట్లో కూడా వెల్లడించారు. అదే సమయంలో ఓ కంటెస్టెంట్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani లోని మరో యాంగిల్ , వ్యాంప్ క్యారెక్టర్లకు వాడుకోవడం తప్పే !
ఆమె కిలాడీ.. వాళ్లిద్దరిని ముంచేస్తుంది

ఆమె కిలాడీ.. వాళ్లిద్దరిని ముంచేస్తుంది

చప్పగా సాగుతోన్న బిగ్ బాస్ షోను ఆసక్తికరంగా మలచడం కోసమో... లేక నిజంగానే జరుగుతోందో తెలియదు కానీ... హౌస్‌లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు. దీనిపై స్పందించిన సూర్య కిరణ్.. ‘మోనాల్ ఖతర్నాక్ కిలాడీ.. ఆమె వాళ్లిద్దరినీ (అఖిల్, అభిజీత్) ముంచేస్తుంది. వాళ్లు ఎంత త్వరగా ఆమె నుంచి దూరమైతే అంత మంచిది' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X