అవినాష్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే.. ఒక్క దెబ్బతో ఆ కష్టాలన్నీ మాయం
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ గా చివరి వారంలోకి అడుగు పెడుతోంది. మూడు నెలలకు పైగా పడుతూ లేస్తూ వస్తున్న షో ఈ వారం చాలా కీలకం కానుంది. వీలైనంత వరకు టాప్ కంటెస్టెంట్స్ తోనే రేటింగ్స్ పెంచుకోవాలని నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక గత వారం హౌజ్ నుంచి వెళ్లిపోయిన అవినాష్ వరుస ఇంటర్వ్యూలతో బిగ్ బాస్ అనుభవాలను పంచుకుంటున్నాడు. ఇక అతని రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆ విషయంలోకి వెళితే..

అతను లేని లోటు కనిపించింది
ఈ సిజన్ లో బెస్ట్ కమెడియన్ గా క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్ అవినాష్ అనే చెప్పాలి. జోకర్ గా వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మొదటి నుంచి కూడా తన కామెడితోనే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. నాగార్జున కూడా అతనికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కంటెస్టెంట్ గా బిరుదు ఇచ్చారు. గత వారం అవినాష్ వెళ్లిపోవడంతో అతను లేని లోటు చాలా క్లియర్ గా కనిపించింది.

సీక్రెట్ టాస్కులు న్యాయం చేస్తూ..
అవినాష్ కేవలం కామెడితోనే కాకుండా బిగ్ బాస్ ఇచ్చిన కొన్ని సీక్రెట్ తాస్కులకు తగిన న్యాయం చేసి క్రేజ్ అందుకున్నాడు. నవ్వుకుంటూనే వెన్నుపోట్లు పొడుస్తూ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా అందుకోకుండా తన క్రేజ్ కూడా పెంచుకున్నాడు. ఇక ఎలిమినేట్ అయ్యే ముందు వరకు కూడా అవినాష్ గట్టిగానే పోరాడాడు. కొన్నిసార్లు డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడు అతను చాలా ఎమోషనల్ అవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

అవినాష్ ఎలిమినేషన్ పై అనుమానాలు
ఇక గత వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వడంపై అనుమానాలు చాలానే వచ్చాయి. మోనాల్ ను అవినాష్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్న సమయంలో అందరూ మోనాల్ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఊహించని విదంగా బిగ్ బాస్ అవినాష్ ను పంపించడం కాస్త అసహనానికి గురి చేసింది. ఫైనల్స్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ను ఇలా ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదని అనుమానాలు చాలానే వచ్చాయి.

చాలా రిస్క్ చేసిన అవినాష్
ఇక అవినాష్ ఈ షో ద్వారా రెమ్యునరేషన్ ఎంత అందుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ కోసం అవినాష్ చాలా రిస్క్ చేశాడనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఉంటున్న జబర్దస్త్ కు కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇక అతను జబర్దస్త్ ద్వారా వారానికి 5 నుంచి 6 లక్షల వరకు అందుకునేదట.

అవినాష్ రెమ్యునరేషన్ ఎంత
ఇక బిగ్ బాస్ లో దాదాపు రెండు నెలలకు పైగా ఉన్న అవినాష్ మంచి ఆదాయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రోజుకు లక్షకు పైగానే అందుకున్న అవినాష్ వారానికి 8 లక్షల వరకు అందుకునేలా డీల్ సెట్ చేసుకున్నారట. ఇక రెండు నెలల లెక్కన 40 నుంచి 45లక్షల వరకు అందుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. మొత్తానికి ఒక విధంగా అవినాష్ తన కష్టాలను బిగ్ బాస్ ద్వారా సాల్వ్ చేసుకున్నట్లు సమాచారం.
Recommended Video

బిగ్ బాస్ ను ఆయుధంలా వాడుకొని..
సొంతంగా ఫ్లాట్ తీసుకున్న అవినాష్ జబర్దస్త్ మీద నమ్మకంతో లోన్ తీసుకున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల తరువాత తల్లి చికిత్స కోసం మళ్ళీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక మెయిన్ గా లాక్ డౌన్ మొదలవ్వడంతో మరో అవకాశం లేకుండా పోయింది. దీంతో బిగ్ బాస్ ను ఆయుధంలా మార్చుకున్న అవినాష్ మళ్ళీ సెట్టవ్వాలంటే చేయక తప్పదని భారీ రిస్క్ తీసుకున్నాడు. అనుకున్నట్లు రెండు నెలల పాటు కొనసాగి ఒక విధంగా తన పరిస్థితులను చక్క బెట్టుకున్నాడు అవినాష్.


Click it and Unblock the Notifications











