బిగ్‌బాస్ ఇచ్చిన చెక్కులతో షాపింగ్ చేసుకుంటున్న గంగవ్వ.. కొత్త ఇంటిపై కూడా క్లారిటీ ఇచ్చేసింది!

జీవితంలో ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదని యూ ట్యూబ్ స్టార్స్ చెప్పకనే చెబుతున్నారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి క్రేజ్ అందుకుంటున్న వారు ఇప్పుడు స్టార్ సెలబ్రెటీస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇక గంగవ్వ ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మై విలేజ్ షో నుంచి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయణంతో జనాలకు మరింత దగ్గరయ్యారు.

బిగ్ బాస్ లో గెలిచిన డబ్బుతో..

బిగ్ బాస్ లో గెలిచిన డబ్బుతో..

ఇక బిగ్ బాస్ షోలో ఆమె గెలుచుకున్న చేక్ లను ఉపయోగించుకొని షాపింగ్స్ చేస్తోంది. బిగ్ బాస్ షోలో కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా గంగవ్వ సడన్ గా సొంత నిర్ణయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె షోలో ఉన్నన్ని రోజులు మంచి పోటీని ఇచ్చింది. మంచి గుర్తింపు కూడా అందుకుంది. ఓట్లు కూడా బాగానే పడ్డాయి.

 లక్ష రూపాయల బంగారం

లక్ష రూపాయల బంగారం

అసలు మ్యాటర్ లోకి వెళితే.. షోలో ఒకసారి ఆమె ఫ్యాషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు గెలిచిన చెక్కులు ఇటీవల అందడంతో బంగారం కొనేందుకు హైదరాబాద్ కు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా గంగవ్వ తన ఛానెల్ లో పోస్ట్ చేసింది. స్పెషల్ గా లక్ష రూపాయల బంగారంను కూడా కొనుగోలు చేసింది.

గంగవ్వను కలిసిన లాస్య

గంగవ్వను కలిసిన లాస్య

ఇక మరో కంటెస్టెంట్స్ లాస్య కూడా ఇటీవల గంగవ్వకు కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లింది. అక్కడ గంగవ్వతో మాట్లాడి పొలం పనులు చేసేందుకు కూడా వెళ్లింది లాస్య. ఆ వీడియోను కూడా తన యూ ట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. గంగవ్వ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత సెలబ్రెటీలతో పాటు చాలా మంది జనాలు ఆమెతో ఫొటోలు దిగేందుకు వస్తున్నారు.

 త్వరలోనే ఇల్లు.. స్పెషల్ వీడియో

త్వరలోనే ఇల్లు.. స్పెషల్ వీడియో

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు గంగవ్వ ఇంటి కోసం నాగార్జునను రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తప్పకుండా ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక మొత్తానికి బిగ్ బాస్ ఆధ్వర్యంలో నాగార్జున కట్టిస్తున్న ఇల్లుపై కూడా గంగవ్వ త్వరలో వీడియో వదలనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X