అభిమానులని టెన్షన్ పెడుతున్న గంగవ్వ.. మరో సంపూర్ణేష్ బాబులా అవ్వదు కదా?

టాప్ రియాలిటీ షోగా.ప్రస్తుతం బుల్లితెరపై మంచి టీఆర్పీతో దూసుకుపోతోంది బిగ్ బాస్. ఈ నాలుగవ సిజన్ లో కంటెస్టెంట్స్ విషయంలో ఆడియెన్స్ పెద్దగా థ్రిల్ అవ్వకపోయినప్పటికి రోజురోజుకి టాస్క్ లతో షోపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఇక గంగవ్వకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది. ఆమెను హౌజ్ లో నుంచి పంపించకూడదాని ఫ్యాన్స్ వారి ఓట్లతో భారీ స్థాయిలో మద్దతు ఇస్తున్నారు.

కల్లాకపటం లేని మనసు

కల్లాకపటం లేని మనసు

మై విలేజ్ షోతో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న గంగవ్వకు ముందు నుంచే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక షోలో ఆమె రియాలిటీ బిహేవియర్ కనిపించింది. అమాయకత్వం, ముక్కుసూటి తనం అలాగే కల్లాకపటం లేని మనసు జనాలను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

 టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

మొదటి వారమే ఆమెకు అంధరికంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి అంటే అభిమానం డోస్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. అయితే గంగవ్వ మాత్రం తన ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఆమెకు అక్కడ పరిస్థితులకు కొంత అలవాటు పడలేకపోతోందని అర్ధమవుతోంది. అందుకే ఎలిమినేషన్స్ ప్రక్రియలో ప్రతీ సారి తనే ముందుడుగు వేస్తోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

నా వల్ల కాదు బిడ్డ, నేను పోతాను

నా వల్ల కాదు బిడ్డ, నేను పోతాను

నా వల్ల కాదు బిడ్డ, నేను పోతాను అంటూ పదే పదే అయిష్టంగానే తన ఆలోచనను బయటపెట్టోస్తోంది. ఇక రీసెంట్ గా వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ లో నాగార్జున ఆమెను కూల్ చేశాడు. అది ప్రేక్షకుల చేతుల్లో మాత్రమే ఉందని చాలా క్లియర్ గా చెప్పారు. రెండొవారం ఎలిమినేషన్స్ లో కూడా మొదట గంగవ్వే బయటకు దూకింది.

గతంలో సంపూర్ణేష్ బాబు

గతంలో సంపూర్ణేష్ బాబు

అయితే గంగవ్వ అయిష్టతను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ఆమెను బయటకు పంపేస్తాడా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. గంగవ్వ ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చింది అంటే బిగ్ బాస్ తో ఫేస్ టూ ఫేస్ తేల్చుకోని మరీ బయటకు వెళ్ళేరకం. గతంలో సంపూర్ణేష్ బాబు ఏడ్చేసి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే గంగవ్వ మాత్రం అలా చేయదని చెప్పవచ్చు. కావాలంటే గొడవ పెట్టుకొని వెళ్లిపోవడం కాయం.

Recommended Video

Bigg Boss Telugu 4: Episode 9 Highlights | 2nd Elimination Nominations
బిగ్ బాస్ నుంచి గంగవ్వ వెళ్లిపోతే..

బిగ్ బాస్ నుంచి గంగవ్వ వెళ్లిపోతే..

కానీ బిగ్ బాస్ హౌజ్ నుంచి గంగవ్వ వెళ్లిపోతే మాత్రం రేటింగ్ భారీ స్థాయిలో తగ్గే అవకాశం లేకపోలేదు. ఆమె కోసం వేస్తున్న ఓట్లను చూస్తేనే అర్ధమవుతోంది. దాదాపు 40శాతం ఓట్లు ఆమెకే పడుతున్నాయి. అందుకే బిగ్ బాస్ ఇప్పట్లో ఆమెను పంపేలా లేడని అర్దమవుతోంది. ఇక గంగవ్వ షో చివరివరకు ఉండదని మరొక టాక్ వస్తోంది. మరి గంగవ్వ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X