రాత్రుళ్ళు ఐస్ క్రీమ్ అమ్మాను.. అనిల్ రావిపూడి గుర్తించి ఆఫీస్ కు రమ్మన్నారు: ముక్కు అవినాష్
జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్ అవినాష్ ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ లో 4 కంటెస్టెంట్ గా చేరి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసినప్పటికీ కూడా అవినాష్ నటుడవ్వాలనే కోరిక వలన అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందట. బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చిన అనంతరం అవినాష్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారుతున్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

యాక్టింగ్ స్కూల్ అయిపోగానే..
అవినాష్ మొదట ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయినట్లు చెప్పాడు. అయితే అక్కడ స్టూడెంట్ నుంచి టీచర్ గా ఎదిగినట్లు చెబుతూ పార్ట్ టైమ్ జాబ్ కోసం వివిధ రకాల పనులు కూడా చేసినట్లు చెప్పారు. ఒక గంట యాక్టింగ్ క్లాస్ అయిపోగానే ఒక నెల రోజుల వరకు కిరాణా షాప్ లో కూడా పని చేశానని అన్నారు.

ఆఫీస్ బాయ్ గా కూడా..
అవినాష్ మాట్లాడుతూ.. ఇంట్లో డబ్బులు అడగడం ఇష్టం లేక పార్ట్ టైమ్ జాబ్ ఏది దొరికినా చేయాలని అనుకున్నాను. ఒక ఆఫీస్ బాయ్ గా కూడా వర్క్ చేశాను. ఇక డబ్బులు సరిపోని సమయంలో రాత్రుళ్ళు రోడ్లపై ఐస్ క్రీమ్స్ కూడా అమ్మే వాడిని. వాటితోనే రూమ్ రెంట్స్, ఫుడ్ వంటి అవసరాలకు సరిపోయేవి.

నేను ఏ రోజు అవి కష్టాలని అనుకోలేదు
నేను నటుడిగా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా హ్యాపీగా అనుభవించాలని అనుకున్నాను. ఏనాడు కూడా అవి కష్టాలని నేను అనుకోలేదు. ఓకేవేళ కష్టమని అనిపించినా కూడా మన టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకున్నప్పుడు వాటిని అలా టాస్కులుగా దాటుకుంటూ మన కలను నెరవేర్చుకోవలని అవినాష్ చెప్పాడు.

సూసైడ్ ఆలోచన..
నిజానికి ఆర్టిస్ట్ అనేవాడు చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. ప్రతి రోజు సినిమాలతో బిజీగా ఉంటూ ఎంతో కొంత సంపాదించుకొని జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే సడన్ గా కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయే సరికి ఒక్కసారిగా ఏమి అర్థం కాలేదు. రెండు నెలలు దాచుకున్న డబ్బు అంతా అయిపోయింది. ఇక ఫ్లాట్ కోసం డబ్బులు చెల్లించలేని పరిస్థితి. చాలా కష్టంగా అనిపించి సూసైడ్ కూడా చేసుకోవాలని అనిపించిందని తెలిపాడు.

అనిల్ రావిపూడి పిలిచారు..
బిగ్ బాస్ సీజన్ 4 నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఒక విధంగా నా ఆర్థిక సమస్యలను తొలగించడమే కాకుండా నాలోని టాలెంట్ ను కూడా బయటపెట్టింది. దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఫైనల్ రోజున స్టేజ్ మీద కలిసినప్పుడే నా టైమింగ్ బావుందని చెప్పి మెచ్చుకున్నారు. ఒకసారి ఆఫీస్ కు వచ్చి కూడా కలవమని చెప్పారు. ఆయన నుంచి మంచి ఆఫర్ వస్తుందని అనుకుంటున్నట్లు అవినాష్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











