బిగ్ బాస్4: విన్నర్లను కాపీ కొట్టేస్తున్న కంటెస్టెంట్స్.. కౌశల్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది!

బిగ్ బాస్ సీజన్ 4 మొదలు కాబోతోంది అనగానే చాలా మందిలో ఒక రకమైన అంచనాలు పెరిగాయి. కానీ ఊహించని విధంగా షోలో కంటెస్టెంట్స్ ని చూడగానే జనాలు కొంత నీరాశచెందారనే చెప్పాలి. లాక్ డౌన్ వల్ల ఎవరు కూడా షూటింగ్స్ కి వెళ్ళరు కాబట్టి కొంచెం క్రేజ్ ఉన్నవారినే తీసుకువస్తారని అనుకున్నారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ సారి కంటెస్టెంట్స్ ఎంపిక కొంత నిరాశకు గురి చేసింది.

నాగార్జున చివాట్లు పెట్టడంతో

నాగార్జున చివాట్లు పెట్టడంతో

ఇక షో మొదలైన విధానం కూడా చాలా వరకు బోర్ కొట్టించేసింది. ఆడియెన్స్ వద్ద సింపతి కొట్టేయలని చాలా మంది ప్రవర్తిస్తున్నట్లు అర్ధమైపోయింది. ముఖ్యంగా ఎలిమినేషన్స్ రౌండ్ లో ఎవరికి వారే నామినేట్ అవ్వడం కూడా చిరాకు తెప్పించింది. చివరకు నాగార్జున చివాట్లు పెట్టడంతో హౌజ్ లో ఒక్కసారిగా కంటెస్టెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ లోకి వచ్చేశారు. అయితే వారిలో గతంలో గెలిచిన వారి పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కంటెస్టెంట్స్ నటిస్తున్నట్లే ఉంది..

కంటెస్టెంట్స్ నటిస్తున్నట్లే ఉంది..

మొదటి సీజన్ లో శివబాలాజీ రెండవ సీజన్ లో కౌశల్, ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్ టైటిల్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎవరు గెలుస్తారు అనేది కనీసం ఊహలకు కూడా అందడం లేదు. ఈ సారి కంటెస్టెంట్స్ ఏం చేసినా కూడా యాక్ట్ చేస్తున్నట్లే ఉందని రియాలిటీకి దూరంగా ఉన్నారన్స్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

కౌశల్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది..

కౌశల్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది..


ఇక గత సీజన్స్ లలో గెలిచిన ముగ్గురి ఫార్ములాలతోనే ఈ కంటెస్టెంట్స్ పోరాటం చేస్తున్నారని అర్ధమవుతోంది. ముఖ్యంగా కౌశల్ ఎఫెక్ట్ గట్టిగానే ఉన్నట్లు టాక్. కౌశల్ బిగ్ బాస్ హౌజ్ లో చాలా వరకు తన మొండితనంతోనే కొనసాగడు. హౌజ్ లో ఎవరితో కూడా అతను క్లోజ్ గా ఉండలేదు. అందరూ అతన్ని టార్గెట్ చేయడం కూడా బాగా కలిసొచ్చింది. ఏకంగా అభిమానులే ఒక ఆర్మీ అవతారం ఎత్తి అతనికి మద్దతు ఇచ్చారంటే కౌశల్ ఫార్ములా ఎంతగా వర్కౌట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani లోని మరో యాంగిల్ , వ్యాంప్ క్యారెక్టర్లకు వాడుకోవడం తప్పే !
అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు.. కానీ?

అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు.. కానీ?


ఇక అఖిల్, దేవి, లాంటి కంటెస్టెంట్స్ కూడా అదే తరహాలో అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేవి, శివబాలాజీ తరహాలో అందరితో కలివిడిగా ఉంటూనే టాస్క్ ల విషయం వచ్చేసరికి సీరియస్ గా మారుతోంది. ఇక రాహుల్ పద్ధతిని కూడా కొందరు గట్టిగానే ఫాలో అవుతున్నారు. ఈ విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ రెగ్యులర్ ఫార్ములాలను ఉపయోగిస్తున్నారు కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చెప్పలేము. ఇక నెక్స్ట్ వారం ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X